స్వల్ప లాభాలతో- మెటల్‌, ఐటీ అప్‌!

స్వల్ప లాభాలతో- మెటల్‌, ఐటీ అప్‌!

కర్ణాటకలో బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఉత్సాహంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనువెంటనే చల్లబడ్డాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే లాభాల సెంచరీ సాధించిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 41 పాయింట్లు బలపడి 35,429కు చేరింది. నిఫ్టీ 21 పాయింట్లు పుంజుకుని 10,762 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 0.7-0.4 శాతం స్థాయిలో ఎగశాయి. 
బ్లూచిప్స్‌ తీరిదీ
నిఫ్టీ దిగ్గజాలలో కోల్‌ ఇండియా, టైటన్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, జీ, ఐసీఐసీఐ, విప్రో, ఐవోసీ, బజాజ్‌ ఫిన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 2-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. మరోపక్క సిప్లా, హిందాల్కో, బీపీసీఎల్‌, భారతీ, లుపిన్‌, హెచ్‌పీసీఎల్‌, యూపీఎల్‌, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ 1.6-0.5 శాతం మధ్య క్షీణించాయి. Most Popular