గ్రాన్యూల్స్‌ ఇండియాకు ఎఫ్‌డీఏ బూస్ట్‌!

గ్రాన్యూల్స్‌ ఇండియాకు ఎఫ్‌డీఏ బూస్ట్‌!

మైథిలెర్గోనోవిన్‌ జనరిక్‌ ట్యాబ్లెట్లకు యూఎస్ఎఫ్‌డీఏ అనుమతి లభించినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా తాజాగా పేర్కొంది. కాగా..  మరోవైపు హైదరాబాద్‌లోని జీడిమెట్ల ఏపీఐ ప్లాంటులో ఇటీవల తనిఖీలు చేపట్టిన యూఎస్‌ఎఫ్‌డీఏ ఎలాంటి లోపాలూలేవంటూ క్లీన్‌చిట్‌(ఈఐఆర్‌) ఇచ్చినట్లు కంపెనీ బుధవారమే స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. మార్చిలో ఇదే ప్లాంటుకి ఫామ్‌ 483 జారీ అయినట్లు కంపెనీ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో నేడు గ్రాన్యూల్స్‌ ఇండియా కౌంటర్‌ వెలుగులో నిలిచే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్‌ఎస్ఈలో బుధవారం ఈ షేరు 2.1 శాతం పెరిగి రూ. 97 సమీపంలో ముగిసింది. 



Most Popular