రిటైల్‌ దన్ను-అమెరికా మార్కెట్లు అప్‌!

రిటైల్‌ దన్ను-అమెరికా మార్కెట్లు అప్‌!

ప్రధానంగా రిటైల్‌, టెక్నాలజీ రంగాలు బలపడటంతో బుధవారం వాల్‌స్ట్రీట్‌ పుంజుకుంది. డోజోన్స్‌ 62 పాయింట్లు(0.25 శాతం) పెరిగి 24,769కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 11 పాయింట్లు(0.4 శాతం) లాభంతో 2,722 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ సైతం 47 పాయింట్లు(0.65 శాతం) ఎగసి 7398 వద్ద స్థిరపడింది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ రసెల్‌ 2000... 1 శాతం పెరగడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని తాకడం విశేషం!  కాగా.. ఫెడ్‌ వడ్డీ పెంపు అంచనాలు కొనసాగడంతో ట్రెజరీ ఈల్డ్స్‌ 3.1 శాతానికి ఎగశాయి. వెరసి 2011 జూలై తరువాత గరిష్టాలకు చేరుకున్నాయి. 
మెకీస్‌ జూమ్‌
ఫలితాలు, గైడెన్స్‌ ఆకట్టుకోవడంతో డిపార్ట్‌మెంట్‌ స్టోర్స్‌ సంస్థ మెకీస్‌ 11 శాతం దూసుకెళ్లింది. ఇది ప్రత్యర్థి సంస్థలు,  జేసీ పెన్నీ, కోల్స్‌ కార్ప్‌, నార్‌స్ట్రామ్‌, టార్గెట్‌ తదితరాలకు సైతం పుష్‌నివ్వడంతో డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌ ఇండెక్స్‌ ఏకంగా 5 శాతం జంప్‌చేసింది. టెక్‌ షేర్లలో రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా మైక్రాన్‌ టెక్నాలజీ 5 శాతం ఎగసింది. ఫేస్‌బుక్‌ 0.6 శాతం నీరసించగా.. 3 ఎం 1 శాతం క్షీణించింది. దీంతో మార్కెట్ల లాభాలు పరిమితమైనట్లు నిపుణులు పేర్కొన్నారు.Most Popular