ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?! 

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 3 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,767 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ట్రెజరీ ఈల్డ్స్‌ ఊపందుకోవడంతో మంగళవారం నష్టపోయిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు రిటైల్‌, టెక్నాలజీ స్టాక్స్‌ అండతో బుధవారం పుంజుకున్నాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో అత్యధిక శాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. కాగా..  కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు, ప్రపంచ మార్కెట్ల బలహీనతల నేపథ్యంలో బుధవారం సెన్సెక్స్‌ 156 పాయింట్లు క్షీణించి 35,388 వద్ద నిలవగా.. నిఫ్టీ 61 పాయింట్లు నీరసించి 10,741 వద్ద స్థిరపడింది. తొలుత సెన్సెక్స్‌ 300 పాయింట్ల వరకూ పతనంకాగా.. నిఫ్టీ 10,700 దిగువకు చేరింది. 

నిఫ్టీ కదలికలు ఇలా..!
నేడు నిఫ్టీ బలహీనపడితే తొలుత 10,697 పాయింట్ల వద్ద, తదుపరి 10,653 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే..  తొలుత 10,788 పాయింట్ల వద్ద, తదుపరి 10,834 స్థాయిలోనూ రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని   భావిస్తున్నారు. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు 
నగదు విభాగంలో బుధవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 699 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా..   దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 229 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. సోమవారం రూటుమార్చి నగదు విభాగంలో రూ. 718 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన ఎఫ్‌పీఐలు మంగళవారం యథాప్రకారం రూ. 518 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే. మరోవైపు సోమవారం రూ. 687 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన డీఐఐలు మంగళవారం సైతం రూ. 531 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. 

 Most Popular