స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మే 17)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మే 17)
 • హైదరాబాద్‌లోని దివీస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌-1లో యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు
 • యూఎస్‌ఎఫ్‌డీఏ ఇన్‌స్పెక్టర్లు ప్లాంట్‌పై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్న దివీస్‌ ల్యాబ్స్‌
 • గ్రాన్యూల్స్‌ ఇండియాకు షాక్‌, హైదరాబాద్‌లోని జీడిమెట్ల యూనిట్‌లో ఒక లోపాన్ని గుర్తించిన యూఎస్‌ఎఫ్‌డీఏ
 • క్యూ-4లో 40 శాతం వృద్ధితో రూ.451 కోట్లుగా నమోదైన ముత్తూట్‌ ఫైనాన్స్‌ నికరలాభం
 • ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.6,000 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు ముత్తూట్‌ ఫైనాన్స్‌ కసరత్తు
 • క్యూ-4లో టీవీఎస్‌ లాభం 31 శాతం వృద్ధితో రూ.166 కోట్లుగా నమోదు
 • మూడింతలు పెరిగిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నికరలాభం, రూ.1008 కోట్ల నుంచి రూ.2879 కోట్లకు పెరిగిన లాభం
 • హంగేరీకి చెందిన సోనియాస్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న వివిమెడ్‌ ల్యాబ్స్‌
 • భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య రైల్వే లైను నిర్మాణానికి రూ.200 కోట్ల కాంట్రాక్టు పొందిన టెక్స్‌మాకో రైల్‌
 • బ్లాక్‌చెయిన్‌ ఆధారిత ట్రేడ్‌ నెట్‌వర్క్‌ కోసం 7 బ్యాంకులతో ఇన్ఫోసిస్‌ భాగస్వామ్య ఒప్పందం
 • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రేటింగ్‌ను  ‘బీబీబీ-’ గా కొనసాగించిన ఫిచ్‌ రేటింగ్‌
 • వచ్చే నెల 15 వరకు రూ.వెయ్యి కోట్లను డిపాజిట్‌ చేయాలని జేపీ అసోసియేట్స్‌కు సుప్రీం ఆదేశం
 • డిపాజిట్‌ చేయకుంటే జేపీ ఇన్‌ఫ్రాటెక్‌పై దివాలా ప్రక్రియ కొనసాగుతుందన్న సుప్రీంకోర్టు


Most Popular