ఐదేళ్లలో 1400% లాభం..ఇంకా సత్తా ఉందట..ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ ఇక్కడ మాత్రమే!

ఐదేళ్లలో 1400% లాభం..ఇంకా సత్తా ఉందట..ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ ఇక్కడ మాత్రమే!

V ఫర్ విక్టరీ అంటారు. తెలుగులో వి అనగానే విజయం అనే పదం కదలాడుతుంది. అలానే స్టాక్‌మార్కెట్లో V అంటే వేల్యూగా చెప్పుకుంటే అలా వేల్యూ ఫర్ మనీగా లాభాలు పంచిన స్టాక్స్‌లో అదే అక్షరంతో మొదలయ్యే స్టాక్స్‌లో వీమార్ట్ ముందు ఉంటుంది. వీ-మార్ట్. పేరు వినగానే డిమార్ట్ గుర్తొస్తుంది. ఐతే దానికంటే ముందే లిస్టై..బోలెడంత లాభాలు పంచుతూ సుస్థిరంగా సాగుతోంది ఈ షేరు. ఐదేళ్ల కాలాన్ని పరిశీలించినప్పుడు ప్రతి రూపాయికి 14రూపాయలు లాభం పంచింది..షంషేర్ లాంటి ఈ షేరు గురించిన ఫుల్ డీటైల్స్ మీకు తెలుగులో ప్రాఫిట్ యువర్ ట్రేడ్. ఇన్‌లో తప్ప ఇంకెక్కడా దొరకవు. అవి ఏంటో చూడండి
బుధవారం నాటి ట్రేడింగ్‌లో రూ.2516ని తాకిన వీ-మార్ట్ కొత్త గరిష్టాన్ని సృష్టించింది. నిన్నటి ట్రేడింగ్‌లో 8శాతం పెరగగా..ఇవాళ 8.50శాతం పెరగడం విశేషం. అంటే ఈ ర్యాలీ ఇంకా కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయంటున్నారు. మరి ఇలాంటి షేర్లపై ట్రేడర్లతో పాటు ఇన్వెస్టర్ల కన్నూ పడుతుంది కదా..! ఎందుకంటే..వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్ డీల్ తర్వాత రిటైల్ రంగంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటాయని అంచనాలు ఉన్నాయ్. దానికి తగ్గట్లే, రిటైల్ రంగంలో కొనుగోళ్లు, ఆదాయం, నికరలాభాలు పెరుగుతున్నట్లు క్యు4 ఫలితాలు పరిశీలిస్తే తెలుస్తోంది. అలా దేశీయంగా, అంతర్జాతీయంగా వస్తోన్న మార్పులకు అనుగుణంగా రిటైల్ రంగ షేర్లు ఇరగదీస్తున్నాయ్.


వీ-మార్ట్ విషయానికే వస్తే, టైర్-2, టైర్-3 సిటీల్లో షాపింగ్ మాల్స్ నిర్వహిస్తోంది. కుటుంబం మొత్తానికి అవసరమైన ఉత్పత్తులు వీ-మార్ట్‌లొ విక్రయాలు జరుగుతుంటాయ్. న్యూఢిల్లీకి చెందిన వీ-మార్ట్ ఎక్కువగా ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లోనే డిపార్ట్‌మెంటల్ స్టోర్లు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 2013లో స్టాక్ మార్కెట్లలో లిస్టైంది వీ-మార్ట్.  అప్పట్లో ఇష్యూ ధర రూ.200. కానీ అదే ఏడాది జూన్‌లో రూ.104కి పడిపోవడం గమనార్హం. అదే ఏడాది సెప్టెంబర్‌లో 10శాతం డివిడెండ్ ఇచ్చిన ఈ కంపెనీ ఆ పద్దతిని వరసగా కొనసాగిస్తూ వస్తోంది. అంటే వాటాదారులకు షేరు ధరలో లాభంతో పాటు లాభాల్లోనూ వాటా పంచుతోంది. ఐదేళ్ల క్రితం రూ.160 ఉన్న వీ-మార్ట్ షేరు ధర ఇప్పుడు ఎంత ఉందో ముందే చెప్పుకున్నాం కదా..! మన సెన్సెక్స్ ఈ ఐదేళ్ల కాలంలో 73శాతం పెరగగా..వీ-మార్ట్ మాత్రం 1410శాతం లాభాలు పంచింది.


మార్కెట్ కేపిటలైజేషన్ చూస్తే ప్రస్తుతం రూ.4501కోట్లు, మరి ఐదేళ్లక్రితం రూ.287కోట్లు మాత్రమే. అంటే కంపెనీ వేల్యేషన్ ఎలా పెరిగిందో చూడండి. గత క్యు3 ఫలితాలు చూస్తే..ఎబిటా(ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్, అమార్టైజేషన్) 30శాతం పెరగగా, నికరలాభం 27శాతం పెరిగింది. ఈ లెక్కలు దృష్టిలో పెట్టుకునే స్టీవార్ట్ & మాకెరిట్చ్ వెల్త్ మేనేజ్‌మెంట్ అనలిస్టులు రాగల 12నెలల కాలంలో  వీ-మార్ట్ రూ.2554 ధరకి పెరుగుతుందని సూచించారు. కానీ షేరు దూకుడు చూస్తుంటే ఈ రేటు ఇంకో రెండు రోజుల్లో సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు(ఎందుకంటే బుధవారం నాటి ట్రేడింగ్‌లోనే షేరు ధర రూ.2516ని తాకింది)
" కొనుగోలుదారులు ఆకాంక్షలకు మార్కెట్లో లభ్యమయ్యే వస్తువులకు పొంతన ఉండటం లేదు..ఇదే అంశాన్ని గ్రహించి వాటి గ్యాప్ పూర్తి చేస్తూ.. గ్రామీణప్రాంతాల్లోకీ చొచ్చుకుపోవడం వీ-మార్ట్ వ్యాపార వ్యూహంగా తెలుస్తోంది. ఈ పధ్దతిలోనే ఒకే స్టోర్లో అనేక ఉత్పత్తుల విక్రయాలు పెంచుతూ విజయాలు సాధిస్తోంది వీమార్ట్.  జిఎస్టీ ద్వారా వచ్చే ప్రయోజనాలను అందిపుచ్చుకునే వస్తువుల విక్రయాలు " భవిష్యత్తులో మంచి లాభదాయకంగా మారతాయని అనలిస్టులు అంచనా వేశారు
2014-2017తో ముగిసిన మూడేళ్ల ఆర్ధిక ఫలితాలను విశ్లేషిస్తే, వీ-మార్ట్ 20శాతం సంచిత పౌనఃపున్య వృధ్ది రేటు సాధించింది. రానున్న రేండేళ్లలో ఇది 22 నుంచి 41శాతం వరకూ పెరుగుతుందని అంచనా వేశారు అభిషేక్ అనే స్టీవార్ట్ & మాకెరిట్చ్ వెల్త్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన అనలిస్ట్..ప్రవేట్ లేబిల్ గూడ్స్ అమ్మకాలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయని అవే వీ-మార్ట్ లాభంలో ఎక్కువశాతం వాటా దక్కించుకుంటాయని విశ్లేషించారు. ఇప్పుడీరకపు అమ్మకాలు 54శాతం కాగా రానున్న రోజుల్లో వీటి శాతం 80గా పెరుగుతుందని కంపెనీ మేనేజ్‌మెంట్ కూడా చెప్తోంది ఇందుకోసమే తక్కువ మార్జిన్లు మిగిలే కిరాణా సరుకులనుంచి ఎక్కువ మార్జిన్లు తెచ్చిపెట్టే హై ఎండ్ ఫ్యాషన్ సెగ్మెంట్‌వైపు దృష్టి సారించారు
మే24న(అంటే గురువారం) క్యు4 ఆర్ధిక ఫలితాలు, డివిడెండు ప్రకటన కోసం బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకున్న కంపెనీ మేనేజ్‌మెంట్ భవిష్యత్తు వ్యూహాలపైనా సమావేశంలో చర్చించనుంది.Most Popular