ఆద్యంతమూ నేలచూపులే- నష్టాల ముగింపు!

ఆద్యంతమూ నేలచూపులే- నష్టాల ముగింపు!

అటు అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ హైజంప్‌చేయడం, ఇటు కర్ణాటక రాజకీయాలు వేడెక్కడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి. ఆద్యంతమూ నేలచూపులకే పరిమితమైన మార్కెట్లు చివరివరకూ బలహీనంగానే కదిలాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 156 పాయింట్లు క్షీణించి 35,388 వద్ద నిలవగా.. నిఫ్టీ 61 పాయింట్లు నీరసించి 10,741 వద్ద స్థిరపడింది. తొలుత సెన్సెక్స్‌ 300 పాయింట్ల వరకూ పతనంకాగా.. నిఫ్టీ 10,700 దిగువకు చేరింది.
ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 3 శాతం పతనంకాగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1 శాతం క్షీణించింది. అయితే రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 2 శాతం చొప్పున జంప్‌చేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, సిప్లా, అల్ట్రాటెక్‌, ఆర్‌ఐఎల్‌, గెయిల్‌, బీపీసీఎల్‌, ఎస్‌బీఐ, హిందాల్కో, హీరోమోటో, ఓఎన్‌జీసీ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. మరోపక్క హెచ్‌యూఎల్‌ దాదాపు 4 శాతం జంప్‌చేయగా.. లుపిన్‌, ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, యస్‌బ్యాంక్‌, జీ, ఎంఅండ్‌ఎం, సన్‌ ఫార్మా 2-1 శాతం మధ్య ఎగశాయి. కాగా.. బీఎస్ఈలో ట్రేడైన మొత్తం షేర్లలో 1598 నష్టపోగా.. 1024 లాభపడ్డాయ్‌.
ఎఫ్‌పీఐల అమ్మకాలు 
సోమవారం రూటుమార్చి నగదు విభాగంలో రూ. 718 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం యథాప్రకారం రూ. 518 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించారు. మరోవైపు సోమవారం రూ. 687 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మంగళవారం సైతం రూ. 531 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి.Most Popular