క్యూ4 ఎఫెక్ట్‌- సెంచురీ ప్లై నేలచూపు

క్యూ4 ఎఫెక్ట్‌- సెంచురీ ప్లై నేలచూపు

గతేడాది(2017-18) చివరి క్వార్టర్‌లో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో సెంచురీ ప్లై బోర్డ్స్‌ కౌంటర్‌లో వరుసగా రెండో రోజు అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు దాదాపు 9 శాతం కుప్పకూలి రూ. 279 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 276 దిగువన 6 నెలల కనిష్టాన్ని తాకింది. 
ఫలితాలు వీక్‌
క్యూ4(జనవరి-మార్చి)లో సెంచురీ ప్లై నికర లాభం 36 శాతం క్షీణించి రూ.  36 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతంపైగా ఎగసి రూ. 544 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) నామమాత్రంగా పెరిగి రూ. 83 కోట్లను అధిగమించింది. ఇబిటా మార్జిన్లు 17.1 శాతం నుంచి 15.3 శాతానికి బలహీనపడ్డాయి.Most Popular