టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ఫలితాలు ఓకే!

టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ఫలితాలు ఓకే!

కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గతేడాది(2017-18) చివరి క్వార్టర్‌లో టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 15 శాతం పెరిగి రూ. 21 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 6 శాతం పుంజుకుని రూ. 977 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 27 శాతం ఎగసి రూ. 23 కోట్లకు చేరింది. కాగా.. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టీమ్‌లీజ్‌ షేరు దాదాపు 1 శాతం బలపడి రూ. 2,777 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,915 వరకూ ఎగసింది.Most Popular