క్యూ4లో టీవీఎస్‌ స్పీడ్‌- షేరు డల్‌!

క్యూ4లో టీవీఎస్‌ స్పీడ్‌- షేరు డల్‌!

ద్విచక్ర వాహన దేశీ దిగ్గజం టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ  గతేడాది(2017-18) చివరి క్వార్టర్‌లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 31 శాతం ఎగసి రూ. 166 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 40 శాతం జంప్‌చేసి రూ. 3,993 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 74 శాతం పుంజుకుని రూ. 281 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 7 శాతం నుంచి 7.5 శాతానికి బలపడ్డాయి. కాగా.. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టీవీఎస్‌ మోటార్‌ షేరు 1 శాతం క్షీణించి రూ. 614 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 580 వరకూ పతనమైంది.Most Popular