యూరప్‌ మార్కెట్లు ఫ్లాట్‌-మైక్రో ఫోకస్‌ హైజంప్‌!

యూరప్‌ మార్కెట్లు ఫ్లాట్‌-మైక్రో ఫోకస్‌ హైజంప్‌!

యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ ఊపందుకున్న నేపథ్యంలో యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌, యూకే ఇండెక్స్‌ ఫుట్సీ  0.15 శాతం స్థాయిలో పుంజుకోగా.. ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ నామమాత్ర లాభంతో ట్రేడవుతోంది. 
ఎలియర్‌ పతనం
గైడెన్స్‌ ఆకట్టుకోవడంతో హ్యూలెట్‌ ప్యాకార్డ్‌కు చెందిన సంస్థ మైక్రో ఫోకస్‌ 9 శాతం దూసుకెళ్లింది. ప్రోత్సాహకర ఫలితాల కారణంగా ఫ్రెంచ్‌ విద్యుత్‌ రంగ దిగ్గజం ఆల్‌స్తోమ్‌ 4 శాతం జంప్‌చేసింది. అయితే లాభాలు తగ్గనున్నట్లు గైడెన్స్‌ ఇవ్వడంతో ఎలియర్‌ 15 శాతం కుప్పకూలింది.Most Popular