క్యూ4- హిందాల్కో వీక్‌!

క్యూ4- హిందాల్కో వీక్‌!

గతేడాది(2017-18) చివరి క్వార్టర్‌లో అల్యూమినియం దిగ్గజం హిందాల్కో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 377 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం పెరిగి రూ. 11,611 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 7 శాతం నీరసించి రూ. 1258 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 12.2 శాతం నుంచి 10.8 శాతానికి బలహీనపడ్డాయి.
రూ. 5.15 డివిడెండ్‌
వాటాదారులకు షేరుకి రూ. 1.20 డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు నిర్ణయించినట్లు హిందాల్కో ఇండస్ట్రీస్‌ ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడించింది. కాగా.. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హిందాల్కో షేరు 1.3 శాతం నష్టంతో రూ. 241 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 237 వరకూ జారింది.



Most Popular