మార్కెట్లకు ఎఫ్‌ఎంసీజీ అండ- నష్టాల రికవరీ!

మార్కెట్లకు ఎఫ్‌ఎంసీజీ అండ- నష్టాల రికవరీ!

కర్ణాటక అనిశ్చితి, ప్రపంచ మార్కెట్ల నష్టాల నేపథ్యంలో బలహీనంగా కదులుతున్న మార్కెట్లు ప్రస్తుతం కాస్త కోలుకున్నాయి. తొలుత 300 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్‌ ప్రస్తుతం 86 పాయింట్లు తక్కువగా 35,458కు చేరింది. నిఫ్టీ సైతం 43 పాయింట్ల క్షీణతతో 10,759 వద్ద ట్రేడవుతోంది. అమ్మకాల ఒత్తిడితో నిఫ్టీ తొలుత 10,700 దిగువకు సైతం చేరిన సంగతి తెలిసిందే. 
పీఎస్‌యూ బ్యాంక్స్‌ డౌన్‌
ఎన్‌ఎస్ఈలో ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ రంగాలు దాదాపు 2 శాతం చొప్పున ఎగశాయి. దీంతో మార్కెట్లు రికవర్‌ అయ్యాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2  శాతం పతనంకాగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మెటల్‌, ఆటో 0.8-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. 
డెరివేటివ్స్‌ తీరిదీ
డెరివేటివ్‌ కౌంటర్లలో ఆర్‌కామ్‌ 17 శాతం కుప్పకూలగా.. పీఎన్‌బీ, సిండికేట్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ నావల్‌, బీవోబీ, ఫెడరల్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, బలరామ్‌పూర్‌, టీవీఎస్‌ మోటార్‌, ఐసీఐసీఐ ప్రు 11-3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు కర్ణాటక బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, టీవీ18, బీఈఎంఎల్‌, సుజ్లాన్‌, గ్రాన్యూల్స్‌, పీసీ జ్యువెలర్స్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, గ్లెన్‌మార్క్‌, బాలకృష్ణ 6-2 శాతం మధ్య ఎగశాయి.Most Popular