ఐటీసీ ఫలితాలు భేష్‌- షేరు ఓకే

ఐటీసీ ఫలితాలు భేష్‌- షేరు ఓకే

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ గతేడాది(2017-18) చివరి క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 10 శాతం పెరిగి రూ. 2,933 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 5 శాతం క్షీణించి రూ. 10,813 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభం(ఇబిటా) 7 శాతం పుంజుకుని రూ. 4144 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 38.4 శాతం నుంచి 39.1 శాతానికి బలపడ్డాయి.
రూ. 5.15 డివిడెండ్‌
వాటాదారులకు షేరుకి రూ. 5.15 డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు నిర్ణయించినట్లు ఐటీసీ ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడించింది. కాగా.. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐటీసీ షేరు 0.8 శాతం బలపడి రూ. 284 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 286 వరకూ ఎగసింది.Most Popular