కోలుకున్న మార్కెట్లు- రియల్టీ జూమ్‌!

కోలుకున్న మార్కెట్లు- రియల్టీ జూమ్‌!

కర్ణాటక అనిశ్చితి, ప్రపంచ మార్కెట్ల నష్టాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. తొలుత 300 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్‌ ప్రస్తుతం కోలుకుంది. 98 పాయింట్లు తక్కువగా 35,446కు చేరింది. నిఫ్టీ సైతం 40 పాయింట్ల క్షీణతతో 10,762 వద్ద ట్రేడవుతోంది. అమ్మకాల ఒత్తిడితో నిఫ్టీ తొలుత 10,700 దిగువకు సైతం చేరిన సంగతి తెలిసిందే.
పీఎస్‌యూ బ్యాంక్స్‌ డౌన్‌
ఎన్‌ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2.25 శాతం పతనంకాగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మెటల్‌ 0.4 శాతం చొప్పున బలహీనపడ్డాయి. అయితే రియల్టీ దాదాపు 2 శాతం ఎగసింది. ఎఫ్‌ఎంసీజీ 0.7 శాతం పుంజుకుంది. రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్‌ 11 శాతం దూసుకెళ్లగా.. డీఎల్‌ఎఫ్‌, బ్రిగేడ్‌, ఫీనిక్స్‌ 1.6-0.5 శాతం మధ్య బలపడ్డాయి.
దిగ్గజాలు ఇలా
నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్‌, సిప్లా, హీరోమోటో, ఐసీఐసీఐ, గెయిల్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌పీసీఎల్‌, ఆర్‌ఐఎల్‌, బీపీసీఎల్‌, ఐవోసీ 2.7-1.3 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు హెచ్‌యూఎల్‌, విప్రో, లుపిన్‌, యస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, టైటన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్ ఫార్మా 3-0.5 శాతం మధ్య లాభపడ్డాయి.Most Popular