క్యూ4- సిండికేట్‌ బ్యాంక్‌ పతనం!

క్యూ4- సిండికేట్‌ బ్యాంక్‌ పతనం!

గతేడాది(2017-18) చివరి క్వార్టర్‌లో నిరుత్సాహకర ఫలితాలు సాధించిన సిండికేట్‌ బ్యాంక్‌ కౌంటర్లో భారీ అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 11.4 శాతం కుప్పకూలి రూ. 44.50 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 44 వద్ద 9 ఏళ్ల కనిష్టాన్ని తాకింది. 
ఫలితాలు వీక్‌
క్యూ4(జనవరి-మార్చి)లో సిండికేట్‌ బ్యాంక్‌ రూ. 2195 కోట్లమేర నికర నష్టం ప్రకటించింది. బ్యాంక్‌ లాభదాయకతను మొండిరుణాల కేటాయింపులు దెబ్బతీయగా.. 2016-17 క్యూ4లో రూ. 104 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొండి బకాయిలకు మూడు రెట్లు అధికంగా రూ. 3545 కోట్ల ప్రొవిజన్లు చేపట్టింది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 6913 కోట్ల నుంచి రూ. 6046 కోట్లకు మందగించింది.Most Popular