మరోసారి కుప్పకూలిన అడాగ్‌ షేర్లు!

మరోసారి కుప్పకూలిన అడాగ్‌ షేర్లు!

ఆటుపోట్ల మధ్య సాగుతున్న మార్కెట్లలో అనిల్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) షేర్లు మళ్లీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో అమ్మకాలు చేపడుతుండటంతో ప్రస్తుతం రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌) అధ్యక్షతన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ కేపిటల్‌, రిలయన్స్‌ పవర్‌,  రిలయన్స్‌ నావల్‌ నేలచూపులకు పరిమితమై కదులుతున్నాయి.
ఆర్‌కామ్‌ బోర్లా
ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఆర్‌కామ్‌ 19 శాతంపైగా కుప్పకూలి రూ. 10 వద్ద ట్రేడవుతోంది. ఇందుకు 2014లో ఏడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఎరిక్‌సన్‌ రూ. 1155 కోట్ల పరిహారాన్ని కోరుతున్నట్లు వెలువడ్డ వార్తలు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక రిలయన్స్‌ నావల్‌ 8 శాతం దిగజారి రూ. 12.5కు చేరగా.. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ 3 శాతం పతనమై రూ. 240ను తాకింది. తొలుత రూ. 230 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ బాటలో రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ దాదాపు 4 శాతం నీరసించి రూ. 54 వద్ద కదులుతోంది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనించదగ్గ అంశం! ఇదే విధంగా ఆర్‌పవర్‌ 2.2 శాతం క్షీణించి రూ. 33 దిగువన ట్రేడవుతోంది. Most Popular