మార్కెట్ల నేలచూపు- చిన్న షేర్లు వీక్‌!

మార్కెట్ల నేలచూపు- చిన్న షేర్లు వీక్‌!

బలహీన ప్రపంచ సంకేతాలు, కర్ణాటక రాజకీయ అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 168 పాయింట్లు క్షీణించి 35,375కు చేరగా.. నిఫ్టీ 58 పాయింట్ల వెనకడుగుతో 10,743 వద్ద ట్రేడవుతోంది. కాగా.. మార్కెట్ల బాటలో చిన్న షేర్లలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. దీంతో బీఎస్‌ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1460 నష్టపోగా.. 820 లాభాలతో కదులుతున్నాయి.
క్షీణపథంలో
మిడ్‌ క్యాప్స్‌లో ఆర్‌కామ్‌ 16 శాతం కుప్పకూలగా.. వక్రంగీ, రిలయన్స్‌ నిప్పన్‌, హడ్కో, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఫెడరల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, క్రిసిల్‌, చోళమండలం, పెట్రోనెట్‌ తదితరాలు 5-2 శాతం మధ్య క్షీణించాయి. ఇక స్మాల్‌ క్యాప్స్‌లోనూ క్లారియంట్‌, సిండికేట్‌ బ్యాంక్‌, అదానీ ట్రాన్స్‌, రోల్టా, జిందాల్‌ పాలీ, మంధన, పార్శ్వనాథ్‌, శక్తి పంప్స్‌, రిలయన్స్‌ నావల్‌, ఉత్తమ్‌ షుగర్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, పయనీర్‌ డిస్టిల్లరీస్‌ తదితరాలు 10-5 శాతం మధ్య పతనమయ్యాయి. Most Popular