మూడున్నరేళ్ల గరిష్టానికి ముడిచమురు

మూడున్నరేళ్ల గరిష్టానికి ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు మండుతూనే ఉన్నాయి. మంగళవారం న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ 0.5 శాతం పెరిగి 71.31 డాలర్ల వద్ద ముగిసింది. ఇక లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు సైతం 0.3 శాతం బలపడి 78.43 డాలర్ల వద్ద నిలిచింది. వెరసి చమురు ధరలు 2014 నవంబర్‌నాటి స్థాయిలను తాకాయి. కాగా..  ప్రస్తుతం నైమెక్స్‌ బ్యారల్ 0.2 శాతం క్షీణించి  71.16 డాలర్లకు చేరగా..  బ్రెంట్‌ బ్యారల్ సైతం 0.2 శాతం నీరసించి 78.27 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 
కారణాలేంటంటే?
మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాలకు కీలకమైన ఇరాన్‌తో మూడేళ్ల క్రితం కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకోవడంతో చమురు ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. అణు ఒప్పందం రద్దుతోపాటు ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు మండుతున్నాయి. ఇప్పటికే ఒపెక్‌ దేశాల ఉత్పత్తి కోత కారణంగా చమురు సరఫరాలు తగ్గి ధరలు పుంజుకున్నాయి. కాగా.. మరోపక్క చమురు ధరలకు బలాన్నిచ్చేందుకు ఒపెక్‌ దేశాలు మరోసారి వియన్నాలో ఈ నెలలో సమావేశంకానున్నాయి.Most Popular