ట్రెజరీ ఈల్డ్స్‌ హైజంప్‌-ఆసియా నష్టాల్లో!

ట్రెజరీ ఈల్డ్స్‌ హైజంప్‌-ఆసియా నష్టాల్లో!

అమెరికా రిటైల్‌ విక్రయాలు ఏప్రిల్‌లో జోరందుకోవడంతో 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ దాదాపు 3.1 శాతానికి ఎగశాయి. ఇంతక్రితం 2011 జూలైలో మాత్రమే ఈ స్థాయికి చేరగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 93.26కు బలపడింది. ఇది 2018లోనే గరిష్టంకాగా.. యూరో 1.18కు బలహీనపడింది. జపనీస్‌ యెన్‌ 110.29కు నీరసించింది. మరోవైపు అమెరికా- చైనా మధ్య వాణిజ్య వివాదం విషయంలో అనిశ్చితి తలెత్తడం కూడా సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోగా.. ప్రస్తుతం ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది.  
నేలచూపులో 
ప్రస్తుతం ఆసియా మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. ఇండొనేసియా, థాయ్‌లాండ్‌, జపాన్‌, సింగపూర్‌, చైనా 1.4-0.20 శాతం మధ్య క్షీణించాయి. ఈ బాటలో తైవాన్‌, హాంకాంగ్ నామమాత్ర నష్టాలతో కదులుతుంటే.. కొరియా మాత్రమే అదికూడా 0.15 శాతం లాభపడింది. Most Popular