సీజీ కన్జూమర్‌ ఫలితాలు ఓకే- షేరు డౌన్‌!

సీజీ కన్జూమర్‌ ఫలితాలు ఓకే- షేరు డౌన్‌!

గతేడాది(2017-18) చివరి క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించినప్పటికీ క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.3 శాతం క్షీణించి రూ. 222 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 221 వరకూ వెనకడుగు వేసింది.
క్యూ4 గుడ్‌
క్యూ4(జనవరి-మార్చి)లో క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ నికర లాభం 32 శాతం పెరిగి రూ. 103 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1076 కోట్ల నుంచి రూ. 1126 కోట్లకు పెరిగింది. అయితే గతేడాది జూలై నుంచి జీఎస్‌టీ అమలు నేపథ్యంలో ఆదాయాన్ని పోల్చతగదని కంపెనీ పేర్కొంది.Most Popular