పతన బాటలో- బ్యాంక్స్‌, ఆటో, ఫార్మా వీక్‌!

పతన బాటలో- బ్యాంక్స్‌, ఆటో, ఫార్మా వీక్‌!

కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి, 3 శాతాన్ని దాటిన అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ వంటి ప్రతికూల అంశాల నడుమ నష్టాలతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మరింత నీరసించాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 273 పాయింట్లు పతనమై 35,270కు చేరగా.. నిఫ్టీ 90 పాయింట్ల వెనకడుగుతో 10,712 వద్ద ట్రేడవుతోంది. 
రియల్టీ ఎదురీత
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3.4 శాతం పతనంకాగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఫార్మా, ఆటో సైతం 1.3-0.7 శాతం మధ్య బలహీనపడ్డాయి. రియల్టీ మాత్రమే(0.7 శాతం) ఎదురీదుతోంది. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో పీఎన్‌బీ 12 శాతం  కుప్పకూలగా.. సిండికేట్‌, అలహాబాద్‌, ఓబీసీ, బీవోబీ, బీవోఐ, ఇండియన్‌ బ్యాంక్‌, యూబీఐ, ఆంధ్రా, ఎస్‌బీఐ, ఐడీబీఐ, కెనరా 7-1.6 శాతం మధ్య పతనమయ్యాయి.
బ్లూచిప్స్‌ ఇలా
నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, గెయిల్‌, సిప్లా, అల్ట్రాటెక్‌, హీరోమోటో, హెచ్‌పీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ 3.5-2 శాతం మధ్య తిరోగమించాయి. మరోపక్క లుపిన్‌, టెక్‌ మహీంద్రా, విప్రో మాత్రమే 1.5-0.7 శాతం మధ్య బలపడ్డాయి.



Most Popular