బైబ్యాక్‌- ఇండియాబుల్స్‌ రియల్టీ అప్‌!

బైబ్యాక్‌- ఇండియాబుల్స్‌ రియల్టీ అప్‌!

సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడంతో ఇండియాబుల్స్‌ రియల్టీ కౌంటర్‌ నష్టాల మార్కెట్లోనూ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 5.2 శాతం జంప్‌చేసి రూ. 195 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 199 వరకూ ఎగసింది. 
శుక్రవారం మీటింగ్‌
ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనపై చర్చించేందుకు బోర్డు ఈ నెల 18న(శుక్రవారం) సమావేశంకానున్నట్లు ఇండియాబుల్స్‌ రియల్టీ తాజాగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. కాగా.. క్యూ4లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 2639 శాతం దూసుకెళ్లి రూ. 1648 కోట్లను అధిగమించిన సంగతి తెలిసిందే.Most Popular