నష్టాలతో షురూ- ప్రభుత్వ బ్యాంక్స్‌ బోర్లా!

నష్టాలతో షురూ- ప్రభుత్వ బ్యాంక్స్‌ బోర్లా!

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో భారీ అమ్మకాల కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 140 పాయింట్లు క్షీణించి 35,404కు చేరగా.. నిఫ్టీ 46 పాయింట్ల వెనకడుగుతో 10,756 వద్ద ట్రేడవుతోంది. ట్రెజరీ ఈల్డ్స్‌ 3 శాతాన్ని అధిగమించడం, డాలరు బలపడటం వంటి అంశాల కారణంగా మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టపోగా.. ఆసియాలోనూ అధిక శాతం మార్కెట్లు నీరసించాయి. దీనికితోడు కర్ణాటక రాజకీయాలలో అనిశ్చితి ఏర్పడటం సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఐటీ, మెటల్‌ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.2 శాతం పతనంకాగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఫార్మా సైతం 0.7 శాతం చొప్పున బలహీనపడ్డాయి. అయితే ఐటీ, మెటల్‌ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో పీఎన్‌బీ 9 శాతం పతనంకాగా.. అలహాబాద్‌, సిండికేట్‌, ఓబీసీ, ఆంధ్రా, ఎస్‌బీఐ, ఐడీబీఐ, బీవోఐ, యూబీఐ, బీవోబీ 5-1.5 శాతం మధ్య పతనమయ్యాయి.
బ్లూచిప్స్‌ ఇలా
నిఫ్టీ దిగ్గజాలలో హీరోమోటో, ఐసీఐసీఐ, గెయిల్‌, సిప్లా, అల్ట్రాటెక్‌, హెచ్‌పీసీఎల్‌, యాక్సిస్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫిన్‌ 3-1.3 శాతం మధ్య తిరోగమించాయి. మరోపక్క లుపిన్‌, హిందాల్కో, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్, టాటా స్టీల్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి.Most Popular