నీరవ్‌ మోడీ దెబ్బ- పీఎన్‌బీకి నష్టాల షాక్‌!

నీరవ్‌ మోడీ దెబ్బ- పీఎన్‌బీకి నష్టాల షాక్‌!

వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ దెబ్బకు ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కుదేలయ్యింది. గతేడాది(2017-18) చివరి క్వార్టర్‌లో తొలిసారి బ్యాంక్‌ చరిత్రలో నిర్వహణ నష్టం నమోదైంది. అంతేకాకుండా క్యూ4(జనవరి-మార్చి)లో అత్యంత భారీగా  రూ. 13,417 కోట్ల నికర నష్టాన్ని పీఎన్‌బీ ప్రకటించింది. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 6 శాతం పతనమై రూ. 84 దిగువకు చేరింది. రూ. 83.55 వద్ద 52 వారాల కనిష్టాన్నీ తాకింది.
ఎన్‌పీఏలు జూమ్‌ 
క్యూ4లో పీఎన్‌బీ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 12.11 శాతం నుంచి 18.38 శాతానికి ఎగశాయి. నికర ఎన్‌పీఏలు సైతం 7.55 శాతం నుంచి 
11.24 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 17 శాతం క్షీణించి రూ. 3063  కోట్లకు పరిమితమైంది. ప్రొవిజన్లు రూ. 5453 కోట్ల నుంచి రూ. 20,353 కోట్లకు భారీగా ఎగశాయి.Most Popular