లుపిన్‌.. క్యూ4 ఫలితాలు.. ప్చ్‌!

లుపిన్‌.. క్యూ4 ఫలితాలు.. ప్చ్‌!

గతేడాది(2017-18) చివరి క్వార్టర్‌లో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో దేశీ ఫార్మా దిగ్గజం లుపిన్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. దీంతో ఎన్‌ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం దాదాపు 2 శాతం నీరసించి రూ. 741 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 724 దిగువన 52 వారాల కనిష్టాన్ని తాకింది.
రూ. 5 డివిడెండ్‌
క్యూ4(జనవరి-మార్చి)లో లుపిన్‌ రూ. 783 కోట్లమేర నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2016-17) క్యూ4లో రూ. 380 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతంపైగా క్షీణించి రూ. 4034 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 26 శాతం నీరసించి రూ. 699 కోట్లకు పరిమితమైంది. వాటాదారులకు షేరుకి రూ. 5 డివిడెండ్‌ ప్రకటించింది. కాగా.. సమీక్షా కాలంలో  గవిస్‌ గ్రూప్‌ కొనుగోలు కారణంగా రూ. 1464 కోట్లమేర వన్‌టైమ్‌ నష్టం నమోదైనట్లు లుపిన్‌ పేర్కొంది. ఇబిటా మార్జిన్లు 22 శాతం నుంచి 17 శాతానికి మందగించినట్లు తెలియజేసింది.Most Popular