వార్తల్లోని స్టాక్స్.. (May 14)

వార్తల్లోని స్టాక్స్.. (May 14)
  • ఐసీఐసీఐ బ్యాంక్‌ బోర్డులో సీనియర్‌ అధికారి లోక్‌ రంజన్‌ స్వతంత్ర డైరెక్టరుగా కొనసాగుతారని స్పష్టం చేసిన ఆర్థిక శాఖ
  • 13 ఏళ్ళ చరిత్రలో అత్యధిక నికరలాభాన్ని నమోదు చేసిన స్పైస్‌ జెట్‌
  • Q4లో 11శాతం వృద్ధితో రూ.46 కోట్లకు చేరిన స్పైస్‌ జెట్‌ నికరలాభం
  • కెనరా బ్యాంక్‌కు మొండి బకాయిల దెబ్బ, క్యూ-4లో రూ.4860 కోట్లుగా నమోదైన నికర నష్టం
  • మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 45 శాతం క్షీణతతో రూ.8.05 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన న్యూలాండ్‌ ల్యాబ్స్‌
  • రూ.4వేల కోట్ల రుణాలను స్టెర్లింగ్‌ బయోటెక్‌ తిరిగి చెల్లించకపోవడంతో దివాలా పిటిషన్‌ దాఖలు చేసిన ఆంధ్రాబ్యాంక్
  • ‌ఇన్ఫోసిస్‌ బోర్డు నుంచి వైదొలిగిన స్వతంత్ర డైరెక్టర్‌ రవి వెంకటేశన్‌
  • చర్మ సంబంధిత వ్యాధుల చికిత్సలో వినియోగించే గ్లెన్‌మార్క్‌ ఫార్మా టెమోవేట్‌ క్రీమ్‌కు USFDA గ్రీన్‌సిగ్నల్‌
  • జూన్‌ 13కి వాయిదా పడిన లాంకో ఇన్‌ఫ్రా కేసు
  • గీతాంజలిజెమ్స్‌లో 37.86 లక్షల షేర్లను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా విక్రయించిన మోర్గాన్‌ స్టాన్లీ


Most Popular