ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి (మే 14)

 ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి (మే 14)

సోమవారం ట్రేడింగ్‌లో Aditya Birla Fashion and Retail, Godrej Agrovet, The Federal Bank, Gammon India, Dynamatic Technologiesలలో సిగ్నిఫికెంట్‌ మూమెంట్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Aditya Birla Fashion and Retail: మార్చి 31తో ముగిసిన నాల్గో త్రైమాసికంలో కంపెనీ లాభం 33 శాతం పెరిగింది. ఇక  నిధుల సేకరణపై కంపెనీ దృష్టిపెట్టింది. ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.వెయ్యి కోట్ల నిధులను సేకరించాలని ఆ సంస్థ భావిస్తోంది. 

Godrej Agrovet: సోమవారం ఈ కంపెనీ నాల్గో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఆర్థిక ఫలితాలకు అనుగుణంగా కంపెనీ షేర్‌లో కదలికలు ఉంటాయి. సోమవారం ఈ స్టాక్‌ వెలుగులోకి రావొచ్చు. 

The Federal Bank:  ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో తమ వాటాను తగ్గించుకున్నట్టు ఫెడరల్‌ బ్యాంక్‌ ప్రకటించింది. 

Gammon India: గామన్‌ ఇండియా (జీఐఎల్‌), గామన్‌ ట్రాన్స్‌మిషన్‌ (జీటీఎల్‌) విలీనానికి అనుమతులు లభించామని కంపెనీ వెల్లడించింది.
 
Dynamatic Technologies: లాంగ్‌టర్మ్‌ కోసం డైనమిక్‌ టెక్నాలజీస్‌కు BBB+Â రేటింగ్‌నిచ్చిన ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌.Most Popular