బంపర్ డివిడెండ్..ఒక్కో షేరుకి 202 రూపాయలట

బంపర్ డివిడెండ్..ఒక్కో షేరుకి 202 రూపాయలట

డివిడెండ్ షేరుకి ఇస్తే గిస్తే..మహా అయితే ఓ పదిరూపాయిలిస్తే బాగా ఎక్కువ..కానీ, ఏకంగా 202 రూపాయలంటే భలే డివిడెండ్ అనుకోకుండా ఉంటారా..? అందుకే ఇంగర్‌సోల్-రాండ్ ఇండియా కంపెనీ షేరు 20శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ లాక్ చేసింది. ప్రత్యేక డివిడెండు పేరిట కంపెనీ రూ.202 రెండో మధ్యంతర డివిడెండు ఇస్తున్నట్లు కంపెనీ బోర్డు సమావేశంలో ప్రకటించడమే ఇందుకు కారణం ఇంగర్‌సోల్ రాండ్ ఇండియా ఈ డివిడెండు చెల్లించేందుకు మే 25ని రికార్డు తేదీగా ప్రకటించింది. అంటే ఈ తేదీలోపున షేర్లు డీమాట్ అక్కౌంట్లో ఉన్నవారికి రూ.202 డివిడెండ్ వస్తుంది..డివిడెండ్ చెల్లించే తేదీ జూన్ 8,2018. ఇంతే కాదు ఇంగర్‌సోల్ రాండ్ ఇండియా కంపెనీ బోర్డు తుది డివిడెండు పేరిట మరో రూ.3 కూడా ఇచ్చేలా రికమండ్ చేసింది. అలా ఈ ఏడాదిలో మొత్తం రూ.208 మేర డివిడెండు రూపంలో చెల్లిస్తున్నట్లు లెక్క..గత నవంబర్‌లో 3 రూపాయల డివిడెండ్ ఇందులో కలిసి ఉన్నదే. ఇంతా చేసి ఇంగర్‌సోల్ రాండ్ ఇండియా షేరు ధర రూ.854.25 మాత్రమే..అంటే ప్రస్తుత షేరులో 25శాతం ఇరవైరోజుల్లో వచ్చేసినట్లే అనుకోవాలి. కాకపోతే ఈ మధ్యలో ఒడిదుడుకులకు లోను కాకుండా ఉండాలి.

ఫలితాల బూస్ట్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో  ఇంగెర్సోల్‌ ర్యాండ్‌ ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 25  శాతం పెరిగి రూ. 25.5 కోట్లను తాకింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 10 శాతం క్షీణించి రూ. 1363 కోట్లకు పరిమితమైంది. 
ఇంగర్‌సోల్ రాండ్ ఇండియా ఐరిష్ దేశానికి చెందిన సంస్థ. ఇది 1905లో స్థాపింపబడిన కంపెనీ. ఎయిర్ గ్యాస్ కంప్రెషన్ సిస్టమ్స్, పవర్ టూల్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్, థర్మో కింగ్ ట్రాన్స్‌పోర్ట్ టెంపరేచర్ కంట్రోలింగ్ సిస్టమ్స్, క్లబ్ కార్ గోల్ఫ్ కార్లవంటి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న బ్రాండ్ ఇంగర్‌సోల్ రాండ్. ఏసీ కూలింగ్, హీటింగ్ డివైజెస్ తయారీలో ఐఆర్ నంబర్ వన్ ఐరిష్ బ్రాండ్. 
నేటి ట్రేడింగ్‌లో 99640షేర్లు చేతులు మారగా ఇంకా 79,622 షేర్లు కొనుగోలు కోసం పెండింగ్‌లో ఉన్నాయి



Most Popular