ఎంతెంత దూరం! ఇంకెంత లాభం..! హెచ్ఈజీ పరుగు ఎక్కడిదాకానో తెలుసా?

ఎంతెంత దూరం! ఇంకెంత లాభం..! హెచ్ఈజీ పరుగు ఎక్కడిదాకానో తెలుసా?

ఏడాదికాలంగా భారీగా లాభం పంచిన స్టాక్ హెచ్‌‌ఈజీ. క్యు4లో కూడా మంచి ఆర్ధిక ఫలితాలను ప్రకటించిన హెచ్ఈజీ 2018 ఆర్ధిక సంవత్సరంలోనే టర్న్ ఎరౌండ్ స్టోరీ నమోదు చేసింది. చైనాలో పొల్యూషన్ కారణాలతో ఇండస్ట్రియల్ ప్లాంట్లు
మూతపడటంతో గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ ఉత్పత్తుల్లో 30శాతం తగ్గుదల నమోదు అయింది. ఇదే హెచ్ఈజీ లాంటి స్టాక్స్‌కి వరంగా మారింది.దీంతో 1000కోట్లకిపైగా లాభాలు ఆర్జించింది. స్టీల్‌ని కరిగించేందుకు వాడే గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ రాడ్ రేటు టన్నుకు 15వేల రూపాయలకు పెరిగింది.దీంతో అటు స్టీల్..ఇటు ఎలక్ట్రోడ్స్ విక్రయాల పరంగా గ్రాపైట్ స్టాక్స్‌కి తిరుగులేని లాభాలు వచ్చాయ్. ఆగ్నేయ ఆసియాదేశాల్లో నంబర్ వన్ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిదారుగా హెచ్ఈజీ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది. దాదాపు 956శాతం లాభాలు పంచింది

ఇది గతం..ఇక ఇప్పుడు ఏం జరగనుంది..ఇదే ఇన్వెస్టర్లతో పాటు ట్రేడర్లనూ ఆలోచనలో పడేసే ప్రశ్న..అనలిస్టులు కూడా ఇప్పుడే హెచ్ఈజీ షేరు పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఎగుమతులపై 20శాతం సుంకం విధిస్తోన్న తరుణంలో లాభాలు కోసుకుపోయే అవకాశం స్పష్టంగా కన్పిస్తుంది. ఇది నిర్వహణ తీరుని దీర్ఘకాలంలో దెబ్బతీస్తుందనే అంచనా ఉంది. కొత్తగా ఈ స్టాక్‌లో కొనుగోలు చేస్తే రిస్క్ -రివార్డ్ రేషియో( లాభనష్టాల తీవ్రత నిష్పత్తి) బాగా పెరిగిందని సూచించారు. ఐతే స్టీల్ సెక్టార్ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉందనే సూచనలు కన్పిస్తున్నా..ఒక చిన్న కుదుపు వచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్. మరోవైపు పర్యావరణ కారణాలతో చైనాలో మూతబడ్డ యూనిట్లు తిరిగి తమ కార్యకలాపాలు సాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయ్. ఇవి 2020లోపు యధాతథ స్థితికి వచ్చే అవకాశం కన్పిస్తోంది. అందుకే గ్రాఫైట్ స్టాక్స్ మార్జిన్ల గైడెన్స్ టన్నుకు 6వేల డాలర్లు-3800డాలర్ల నుంచి 6వేల డాలర్లు-2500డాలర్లకు తగ్గిస్తున్నారు. ఎలక్ట్రోడ్ రాడ్ల ధరలు కూడా తగ్గిపోయాయి.

ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు హెచ్ఈజీ స్టాక్‌లో స్టాప్‌లాస్ తప్పని సరి అని నోమురా ఏజెన్సీ తెలియజేసింది. ఐతే జెఫ్రీస్ ఏజెన్సీకి చెందిన రాహుల్ మూర్క్య మాత్రం హెచ్ఈజీకి బయ్ రేటింగ్‌తో పాటు రూ.3622 టార్గెట్ ప్రైస్ సూచించారు. ప్రస్తుతం( స్టోరీ పబ్లిష్ చేసే సమయానికి ) HEG 0.73శాతం నష్టపోయి రూ.3151.05 వద్ద కదలాడుతోందిMost Popular