ప్రతీ నెలా తెగ లాభాలు ఇచ్చేస్తున్న షేర్లు

ప్రతీ నెలా తెగ లాభాలు ఇచ్చేస్తున్న షేర్లు

ఏదైనా ఒక స్టాక్ బాగా పెర్ఫామ్ చేస్తుండడం గమనిస్తూనే ఉంటాం. కానీ నిలకడగా ధర పెరుగుతుండడం మాత్రం అసాధ్యం అనిపిస్తుంది. మార్కెట్ పరిస్థితులు.. ఆ కంపెనీ వ్యాపారం నిర్వహిస్తున్న సెక్టార్‌లో వచ్చే మార్పులు వంటివి కూడా ప్రభావం చూపుతుంటాయి.

ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కుంటూ.. ప్రతీ నెలా రిటర్న్స్ ఇవ్వడం అంటే మాత్రం చిన్న విషయం కాదు. 2018 ప్రారంభం నుంచి ఇప్పటివరకూ గడచిన నాలుగు నెలల లోను కనీసం ఐదు శాతం లాభాలు పంచిన షేర్లు కొన్ని ఉన్నాయి.

కనిష్టంగా ఒక నెలకు ఐదు శాతం లాభాన్ని తీసుకున్నా.. గరిష్టంగా అయితే 40 శాతం కూడా ప్రాఫిట్స్ పంచడం విశేషంగానే చెప్పుకోవాలి. 

జనవరి నుంచి మన మార్కెట్లు ఆటుపోట్లకు గురయ్యాయి. సూచీలు గరిష్ట స్థాయి నుంచి 11 శాతం తగ్గి..  లోయర్ లెవెల్స్ నుంచి 7 శాతం పైగా పుంజుకున్నాయి. ఇంతటి ఊగిసలాటలోనూ ప్రతీ క్యాలెండర్ మంత్‌లో లాభాలను ఇవ్వగలగడం.. ఈ స్టాక్స్‌లో స్ట్రెంగ్త్‌ను చాటుతుంది. 

గత 4 నెలలలో కనీసం 5 శాతం లాభం పంచిన స్టాక్స్ జాబితాలో అషారి ఏజెన్సీస్(ప్రస్తుత ధర రూ. 80.50), జీఎస్ఎస్ ఇన్ఫోటెక్(ప్రస్తుత ధర రూ. 85.35), ఇషాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ షెల్టర్స్(ప్రస్తుత ధర రూ. 21.75), ఒయాసిస్ సెక్యూరిటీస్(ప్రస్తుత ధర రూ. 50.70), శ్రీ గణేష్ బయోటెక్(ప్రస్తుత ధర రూ. 432.00) కంపెనీలు ఉన్నాయి. 

ఈ మూడు స్టాక్స్ మల్టీబ్యాగర్స్ అనే విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదని.. కింది పట్టిక చూస్తే అర్ధం అవుతుంది. 

 Most Popular