డెక్కన్ గోల్డ్ మైన్...నిజంగా సిరులు కురిపించే షేరేనా..?

డెక్కన్ గోల్డ్ మైన్...నిజంగా సిరులు కురిపించే షేరేనా..?

డెక్కన్ గోల్డ్‌మైన్ పేరే బాగా ఆకర్షణీయంగా ఉంది..ఇప్పుడు మూడు రోజులుగా వరసగా లాభపడుతూ వస్తోంది. ఈ 3 సెషన్లలో 43శాతం పెరిగింది షేరు. హుట్టి గోల్డ్‌మైన్స్ లిమిటెడ్( కర్నాటక ప్రభుత్వానికి చెందిన బంగారపు గని)కి సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు డెక్కన్ గోల్డ్‌మైన్‌‌కి అనుకూలంగా తీర్పు ఇవ్వడమే ప్రస్తుతం ఈ షేరు జోరుకి కారణంగా చెప్తున్నారు. 2011లో డెక్కన్ గోల్డ్‌మైన్ సహా ఇతర మైనింగ్ కంపెనీలకు ఎలాంటి హక్కు లేకుండా హుట్టి గోల్డ్‌మైన్‌ను మాత్రమే ఇక్కడ మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించుకునేలా రిజర్వ్ చేసింది కర్నాటక. ఐతే అప్పటికే డెక్కన్ ఎక్ల్‌ప్లొరేషన్ సర్వీసెస్ ప్రవేట్ లిమిటెడ్‌కి ఇక్కడ మైనింగ్ చేసుకునేందుకు లైసెన్స్ పొంది ఉన్నది. ఈ వ్యవహారంలోనే డెక్కన్ గోల్డ్‌మైన్‌కి వ్యతిరేకంగా స్థానిక కోర్టులు తీర్పు ఇచ్చింది. దానిపై సుప్రీంకోర్టు మే 8న ఇచ్చిన తీర్పు ప్రకారం ఇప్పుడు డెక్కన్ గోల్డ్‌మైన్ హుట్టీ గోల్డ్‌మైన్స్‌లో తవ్వకాలు జరుపుకునే వీలు కలిగింది.

హుట్టి మక్సి గ్రీన్‌స్టోన్ బెల్ట్ అనేది భారతదేశంలోనే అత్యంత పురాతనమైన బంగారపు నిక్షేపాలు ఉన్న గనిగా చెప్తారు. ఇక్కడ దొరికే బంగారం ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన తరహాదిగా గుర్తింపు ఉంది. 851 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది హుట్టి గోల్డ్ మైన్స్ లిమిటెడ్. ఈ విస్తీర్ణంలోనే 21 గోల్డ్ మైనింగ్ బ్లాకులను కనిపెట్టారు. ఈ ఏరియాలో మైనింగ్ చేసుకునేందుకు 11 ప్రాస్పెక్టింగ్ లైసెన్సుల కోసం అప్లికేషన్స్ కర్నాటక ప్రభుత్వం వద్ద  ఉండగా..వాటిలో డెక్కన్ గోల్డ్ మైన్ ఒకటి. తాజా పరిణామంతో డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థకి బాగా కలిసి వస్తుందనేది అంచనా..అందుకే ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో ఈ షేరు బాగా పెరుగుతోంది. ఐతే ఈ సంస్థకి చెందిన టెక్నికల్ అనాలసిస్ చూస్తే ఇప్పటికే బాగా పెరిగిపోయి ఉన్న షేరు బలహీనపడటానికి సిధ్దంగా ఉందని అంటున్నారు..ఇది టెక్నికల్ అనలిస్టుల మాట.


ఇక ఫైనాన్షియల్ విషయాలకు వస్తే..రూ.539కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ కలిగి ఉంది, ఫేస్ వేల్యూ రూ.1 మాత్రమే, షేర్ కేపిటల్ రూ.9 కోట్లు కాగా..మొత్తం ఆస్తుల విలువ రూ.44.10కోట్లు. నాలుగు వరస త్రైమాసికాల ఆర్ధిక ఫలితాలు చూస్తే..అంతా కోటిన్నర రూపాయల నష్టం నుంచి డిసెంబర్ త్రైమాసికంలో 72లక్షల నష్టం చవి చూసింది కంపెనీ.. ప్రస్తుతం (కథనం రాసే సమయానికి ) రూ.58.20వద్ద ట్రేడవుతోందిMost Popular