ఇండోస్టార్‌ కేపిటల్‌కు యాంకర్‌ నిధులు!

ఇండోస్టార్‌ కేపిటల్‌కు యాంకర్‌ నిధులు!

నేటి(9) నుంచి పబ్లిక్‌ ఇష్యూ చేపడుతున్న బ్యాంకింగేతర ఫైనాన్స్‌ సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ) ఇండోస్టార్‌ కేపిటల్‌ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరించింది. 24 యాంకర్‌ సంస్థలకు షేరుకి రూ. 572 ధరలో 96.7 లక్షల షేర్లను కేటాయించింది. తద్వారా రూ. 553 కోట్లను సమకూర్చుకున్నట్లు ఇండోస్టార్‌ తాజాగా తెలియజేసింది. శుక్రవారం(11న) ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ రూ.2,000 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 570-572. ఆఫర్‌లో భాగంగా రూ.700 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటు, ప్రస్తుత వాటాదారులకు చెందిన 30 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను సైతం విక్రయించనుంది. కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన యాంకర్‌ సంస్థలలో ఎస్‌బీఐ ఎంఎఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఎంఎఫ్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తదితరాలున్నాయి.Most Popular