స్వల్ప కాలానికి 4 స్టాక్స్.. 15 శాతం రిటర్న్స్..

స్వల్ప కాలానికి 4 స్టాక్స్.. 15 శాతం రిటర్న్స్..


సోమవారం భారీ లాభాల తర్వాత.. స్టాక్ మార్కెట్లు ఊగిసలాటకు గురయ్యాయి. నిఫ్టీ కీలకమైన నిరోధానికి చేరువలో ఉండడంతో.. ఇండెక్స్ ఆ స్థాయిని అధిగమించేందుకు సాధ్యపడడం లేదు.

గత వారంలో బ్యాంక్ నిఫ్టీ ఔట్‌పెర్ఫామ్ చేసింది. డైలీ చార్టుల ప్రకారం కూడా బుల్లిష్ రివర్స్ ప్యాటర్న్(ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్)‌ను ఫామ్ చేసింది. 100 రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్ 25,360 వద్ద కన్సాలిడేషన్ జరుగుతోంది. 25630 స్థాయి వద్ద 50శాతం రీట్రేస్‌మెంట్ ఉండడంతో ఆ స్థాయిని అధిగమించలేకపోతోంది. ఇలాంటి సమయంలో 15 శాతం రాబడులు అందించే అవకాశం ఉన్న 4 స్టాక్స్‌ను పరిశీలిద్దాం:


భారత్ ఎలక్ట్రానిక్స్| Rating: Buy | టార్గెట్ రూ. 145, స్టాప్ లాస్: రూ. 120, రాబడులకు అవకాశం: 12%
రూ. 93 నుంచి రూ. 193 హై మద్య 61.8 శాతం రీట్రేస్‌మెంట్ లెవెల్ వద్ద భారత్ ఎలక్ట్రానిక్స్ ట్రేడవుతోంది. బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అయిన హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌ను ఫామ్ చేసింది. ఈ స్టాక్‌లో ప్రైస్ పరంగా రివర్సల్ వచ్చే అవకాశం ఉంది.

 

భారత్ పెట్రోలియం| Rating: Accumulate | టార్గెట్ రూ. 415, స్టాప్‌లాస్: రూ. 360, రాబడులకు అవకాశం: 9%
రూ. 50, 61.8 శాతం రీట్రేస్‌మెంట్ లెవెల్స్ వద్ద ఈ స్టాక్ కన్సాలిడేట్ అవుతోంది. స్వల్ప కాలానికి ట్వీజర్ బాటమ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌ను ఈ స్టాక్ ఫామ్ చేసింది. బీపీసీఎల్‌లో పుల్‌బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

ఫెడరల్ బ్యాంక్ | Rating: Buy | టార్గెట్ రూ. 115, స్టాప్‌లాస్: రూ 93, రాబడుకు అవకాశం: 15%
బ్రేకవుట్ రేంజ్ తర్వాత రూ. 95-102 మధ్యలో ఈ స్టాక్ కన్సాలిడేషన్‌కు గురవుతోంది. డైలీ ఛార్టుల ప్రకారం 100 రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్‌కు ఎగువన ఈ స్టాక్‌ క్లోజ్ అయింది. వీక్లీ స్కేల్‌లో పాజిటివ్ క్రాసోవర్‌ను ఎంఏసీడీ చూపుతోంది.

 

జిందాల్ స్టీల్ & పవర్ | Rating: Accumulate | టార్గెట్ రూ. 260, స్టాప్‌లాస్: రూ. 228, రాబడులకు అవకాశం: 8%
ఇంటర్నల్ ట్రెండ్‌లైన్ దగ్గర, మేజర్ మూవింగ్ యావరేజెస్‌కు సమీపంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ కదలాడుతోంది. ఈ ట్రెండ్‌లైన్‌కు ఎగువన ఉన్నంతకాలం హైయర్ లెవెల్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడిన రికమెండేషన్స్‌ను ఏయుఎం క్యాపిటల్ నివేదిక నుంచి తీసుకోవడం జరిగింది. ఈ స్టాక్స్‌లో పెట్టుబడులపై లాభనష్టాలకు ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్ డాట్ ఇన్ బాధ్యత వహించదు. పెట్టుబడులు చేసే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ నిపుణులను సంప్రదించండి.

 Most Popular