వస్త్రాల్లో పట్టువస్త్రంలాంటి షేరు ఇది..! ఇంకో 200 రూపాయలు పెరుగుతుందట

వస్త్రాల్లో పట్టువస్త్రంలాంటి షేరు ఇది..! ఇంకో 200 రూపాయలు పెరుగుతుందట

అప్పారెల్ రంగంలో జిఎస్‌టి అమలు తర్వాత కొన్ని షేర్లు బాగా పెరుగుతాయని అంచనా వేశారు. కొన్ని  ఆ అంచనాలకు తగ్గట్లే రాణించాయి కూడా..! వాటిలో కేవల్ కిరణ్ క్లాతింగ్ సంస్థ గురించే చూస్తే..స్టాక్ మార్కెట్లలో లిస్టైన దగ్గర్నుంచి లెక్కపెడితే 520శాతం పెరిగింది. అంటే పన్నెండేళ్లలో ఏడాదికి దాదాపు 45శాతం లాభం పంచింది. డీసెంట్ రిటర్న్ కిందే లెక్క..ఐనా..  తాజాగా మరో 200 రూపాయలు పెరిగే అవకాశం ఉందని ఆనంద్ రాఠీ బ్రోకరేజీ సంస్థ సూచిస్తోంది. ఈ సంస్థకి ఆనంద్ రాఠీ కవరేజ్ ప్రారంభించడంతో పాటు అట్టిపెట్టుకోమని( హోల్డ్) రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుతం( కథనం రాసే సమయానికి) రూ.1590 వద్ద ట్రేడవుతోన్న ఈ షేరు మరో 13శాతం పెరిగి రూ.1716ని తాకుతుందని చెప్తోంది. అంటే ఇంకో రూ.200 లాభం కేవల్ కిరణ్ క్లాతింగ్ పంచగలదని రికమండ్ చేస్తోంది

పటిష్టమైన పంపిణీ వ్యవస్థ, విభిన్నమైన రంగాలలో పాతుకుపోవడంతో వస్త్రాల తయారీలో ఉన్న కేవల్ కిరణ్ క్లాతింగ్‌కి్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం వీలైంది. కిల్లర్(killer), లామేన్( lawman), ఇంటెగ్రిటీ(integriti), పిజి3(pg3), ఈజీస్(Easies) వంటివి కేవల్ కిరణ్ క్లాతింగ్స్ ఇతర పాపులర్ ఫ్యాషన్ బ్రాండ్లు.

" ఇతర సంస్థలతో పోటీపడే సామర్ధ్యం, అందుబాటులో ఉండే ధరలతో కేవల్ కిరణ్ క్లాతింగ్స్ వినియోగదారులకు మొదటి ఎంపికగా నిలుస్తున్నాయి" అని ఆనంద్ రాఠీ సెక్యూరిటీస్ నివేదికలో పేర్కొంది. 2018 ఆర్ధిక సంవత్సరం నుంచి 2020 మధ్యలో సంస్థ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు 4శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. " మిగిలిన సంస్థలతో పోల్చినప్పుడు కేవల్ కిరణ్ క్లాతింగ్స్ ఆదాయంలో వృద్ది రేటు తక్కువే. ఐతే లాభదాయకతలో పెరుగుదల చాలినంత డబ్బు అందుబాటులో ఉండటం సానుకూల అంశాలు" అని ఆనంద్ రాఠీ రీసెర్చ్ రిపోర్ట్ చెప్తోంది.

సంస్థ వేల్యేషన్స్, మార్కెట్ కేపిటలైజేషన్ వంటి ఇతర అంశాలు కింది పట్టికలో గమనించండి

కేవల్ కిరణ్ క్లాతింగ్స్ వేల్యేషన్ గురించి చూస్తే..సంస్థకి పైసా కూడా అప్పు లేకపోవడం అతి పెద్ద ప్లస్ ‌పాయింట్‌గా గమనించవచ్చు. అలానే రాబడి విషయాన్ని పరిగణించినప్పుడు సంస్థ షేరు మంచి విలువలోనే అందుబాటులో ఉందని ఆనంద్ రాఠీ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. ప్రతికూల అంశాలను చూస్తే, ఇతర సంస్థలనుంచి ఎదురయ్యే పోటీ, పెరుగుతున్న రియలైజేషన్లు నష్టభయం( రిస్క్)గా చూడాలి. గత ఏడాది సమయాన్ని పరిశీలిస్తే, కేవల్ కిరణ్ క్లాతింగ్ 15శాతం నష్టపోయింది. సోమవారం ట్రేడింగ్‌లో 1.94శాతం నష్టంతో రూ.1520 వద్ద ముగియగా నేడు( కథనం రాసే సమయానికి) 4.60శాతం పెరిగి రూ.1590 వద్ద ట్రేడవుతోందిMost Popular