ఇకపై పెరిగే షేర్లు ఈ రంగానివేనట! సఫిర్ ఆనంద్ వ్యూ !

ఇకపై పెరిగే షేర్లు ఈ రంగానివేనట! సఫిర్ ఆనంద్ వ్యూ !

ఏస్ ఇన్వెస్టర్ సఫిర్ ఆనంద్ తన పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసుకున్నారు. ఎంఆర్ఎఫ్, సియట్ లాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్‌ని తన ఖాతాలో ఎప్పుడో వేసేసుకున్న ఈయన..ఇప్పుడు తాజాగా మరి కొన్ని షేర్లను ఎంపిక చేసుకోవడంతో ఆ కంపెనీలపై ఇన్వెస్టర్ల ఆసక్తి కనబరచడం సహజం. అసలు షేర్లు కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి పద్దతులు అవలంబించాలో ఆయన మాటల్లో చూద్దాం


సఫిర్ మాటల్లో " ఎంఆర్ఎఫ్ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.2500కోట్ల మేర ఉన్నప్పుడు రూ.6వేలకోట్లతో విస్తరణ చేపడుతున్నట్లు ప్రకటించింది. దాని బ్రాండ్ వేల్యూ కానీ..గత చరిత్ర కానీ చూసినప్పుడు వెంటనే కొనుగోలు చేశాం" ఆగస్ట్ 2001 నాటి రేటుతో పోల్చుకుంటే ఈ షేరు ఇప్పటికి 15800శాతం పెరిగింది. గత వారమే ఆల్‌టైమ్ హై మార్క్ అయిన రూ.80,000ధరని కూడా తాకింది.  ఆనంద్ సఫిర్ తాను టైర్ స్టాక్స్‌ని ఎంచుకోవడం వెనుక కారణాన్ని చెప్తూ..టైర్ కంపెనీలు కమోడీటీల వంటివే కానీ..అన్నిట్లాంటి కంపెనీ కాదంటారు. రెండు కోట్ల రూపాయల కేపిటల్ నుంచి నిర్మించుకుంటూ వచ్చిన ఎంఆర్ఎఫ్ రూ.6వేలకోట్ల విస్తరణ చేపట్టడమే అద్భుతమైన నిర్వహణ సామర్ద్యానికి నిదర్శనంగా చెప్తారు. ఎంఆర్ఎఫ్ క్రికెట్ అకాడమీ స్థాపన ఈ  సంస్థ మైలురాళ్లలో మరొకటిగా వర్ణిస్తాడాయన. ఒక్క క్రికెట్ బ్యాట్ స్పాన్సర్‌షిప్ కంటే ఈక్విటీ కేపిటల్ తక్కువే అనే విషయాన్ని గుర్తు చేస్తారు

ఇంత సుదీర్ఘమైన పరిశోధన చేసిన సఫిర్ ఆనంద్, రానున్న రోజుల్లో కన్జంప్షన్ థీమ్ అంటే వినియోగ సంబంధిత రంగంపై దృష్టి సారించాలని చెప్తారు. ఐతే బ్రిటానియా, నెస్లే వంటి కంపెనీలను ఎంచుకునేముందు మార్కెట్ సైజు తెలుసుకుని ఎంచుకోవాలని సూచిస్తారు సఫిర్ అలానే వ్యాపార విస్తరణ కోసం భారీగా నిధులు కేటాయించగలిగిన కంపెనీలనే కొనుగోలు చేయమని సఫిర్ ఆనంద సలహా ఇస్తారుMost Popular