ఈ 3 స్టాక్స్‌లో 14శాతం వరకూ లాభాలకు ఛాన్స్

ఈ 3 స్టాక్స్‌లో 14శాతం వరకూ లాభాలకు ఛాన్స్


నిఫ్టీకి 10,780-10,800 జోన్‌లో ప్రాఫిట్ బుకింగ్ ఎదురవుతోందని.. మార్కెట్ ట్రెండ్ సూచిస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెక్సావేర్ టెక్నాలజీస్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్ వంటి కంపెనీల ఫలితాలు నిరుత్సాహపరిచాయి. ఇవి 10-15శాతం మేర కరెక్షన్‌కు గురయ్యాయి.
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, సెంచరీ టెక్స్‌టైల్స్, సీమెన్స్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ వంటి స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ కనిపింంచింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈ స్టాక్స్ ఆదాయ అంచనాలను కూడా విశ్లేషకులు తగ్గించారు. అయితే ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ మాత్రం కొత్త ఆల్‌టైం గరిష్టాన్ని తాకింది.


ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథ స్థాయిలో కొనసాగించడం.. మరోవైపు ఇరాన్‌తో న్యూక్లియర్ డీల్ విషయంలో ట్రంప్ ప్రకటన, చమురు ధరలు వంటివి మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.
ఆప్షన్ డేటా గమనిస్తే 10500 పాయింట్ల వద్ద నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ లభించనుందని సూచిస్తోంది. ఈ స్థాయిలో 40 లక్షల షేర్ల పుట్ ఆప్షన్స్ ఉన్నాయి. అప్‌సైడ్‌లో 11వేల పాయింట్ల వద్ద 61 లక్షల షేర్ల కాల్ ఆప్షన్స్ ఉన్నాయి.


ఇలాంటి సమయంలో షార్ట్‌టెర్మ్‌లో 10-14 శాతం లాభాలనుం అందించే అవకాశాలు ఉన్న 3 స్టాక్స్‌ను పరిశీలిద్దాం:

హావెల్స్ ఇండియా| ప్రస్తుత ధర రూ. 546| Buy | టార్గెట్ రూ. 592 | స్టాప్‌లాస్ రూ. 510 | రాబడులకు అవకాశం 10%
గత అప్‌మూవ్ (రూ. 484-559) నుంచి ఈ స్టాక్ 50శాతం రీట్రేస్ అయింది. ఆ తర్వాత లాంగ్ టెర్మ్ మూవింగ్ యావరేజ్ నుంచి రివర్సల్ తీసుకుంది. డైలీ ఛార్టుల ప్రకారం బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్-పైర్సింగ్ లైన్‌ను ఈ స్టాక్ ఫామ్ చేసింది. నియర్-టెర్మ్ కన్సాలిడేషన్ తర్వాత.. మరోసారి లైఫ్‌టైం హై లెవెల్స్‌కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ | ప్రస్తుత ధర రూ. 224 | Buy | టార్గెట్ రూ. 245 | స్టాప్‌లాస్ రూ. 210 | రాబడులకు అవకాశం 12%
గత కొన్ని రోజులుగా ఈ స్టాక్‌లో ఒత్తిడి కనిపిస్తోంది. ఫాలింగ్ ఛానల్‌కు లోయర్ బ్యాండ్, 20 నెలల మూవింగ్ యావరేజ్‌లు.. ఈ స్టాక్‌కు రివర్సల్ పాయింట్‌గా నిలుస్తోంది. ఈ స్టాక్‌లో డిక్లైన్ వచ్చేందుకు ముందు ఓవర్‌సోల్డ్ పొజిషన్ చేరుకోవడంతో.. డౌన్‌సైడ్ రిస్క్ చాలా తక్కువగా కనిపిస్తోంది.

 

మనప్పురం ఫైనాన్స్| ప్రస్తుత ధర రూ. 126| Buy | టార్గెట్ రూ. 145| స్టాప్‌లాస్ రూ. 119 | రాబడులకు అవకాశం 14%
బుల్ ఫ్లాప్ ప్యాటర్న్ నుంచి బ్రేకవుట్ తీసుకున్న ఈ స్టాక్.. లైఫ్‌టైం హై లెవెల్‌కు చేరుకుంది. మనప్పురం ఫైనాన్స్‌లో మరింతగా అప్‌సైడ్ ఉందనే సూచనలు టెక్నికల్ ఇండికేటర్స్ సూచిస్తున్నాయి. బుల్లిష్ ప్యాటర్న్‌ను కొనసాగిస్తూ.. మరింతగా ర్యాలీ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.


గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడిన రికమెండేషన్స్‌ను రిలయన్స్ సెక్యూరిటీస్ నివేదిక నుంచి తీసుకోవడం జరిగింది. ఈ స్టాక్స్‌లో పెట్టుబడులపై లాభనష్టాలకు ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్ డాట్ ఇన్ బాధ్యత వహించదు. పెట్టుబడులు చేసే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ నిపుణులను సంప్రదించండి.

 Most Popular