ఈ వారం మార్కెట్లు ఎలా ఉండొచ్చు?

ఈ వారం మార్కెట్లు ఎలా ఉండొచ్చు?

ఆరు వారాల తర్వాత మళ్లీ మన మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. అయితే యూఎస్-చైనా‌ల మధ్య చర్చలు జరుగుతుండడంతో.. ట్రేడ్‌వార్‌కు ముగింపు పలికే అవకాశఆలు కనిపిస్తున్నాయి. కానీ ఇదేమంత సులభసాధ్యమైన విషయం కాదు. జనవరి- మార్చ్ త్రైమాసిక ఫలితాలు అంతగా ఆకట్టుకోలేకపోతుండడం కూడా కొంత కలవరపెడుతోంది.


వచ్చే వారం మార్కెట్లకు అత్యంత కీలకం కానుంది. కొన్ని ప్రధాన కంపెనీలు క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇవి ఆయా సెక్టార్లలో వస్తున్న మార్పుచేర్పులకు సూచికలు అయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఎన్నికలు
మరోవైపు కర్నాటక ఎన్నికల ప్రభావం కూడా ఈ సారి ఎన్నికలపై ఎఫెక్ట్ చూపనుంది. వచ్చే శనివారం(మే 12) నాడు ఎన్నికలు  జరగనుండగా.. రాయచూర్, చిత్రదుర్గ, కోలార్‌లలో సోమవారం నాడు.. విజయపుర, మంగళూరు, బెంగళూరులలో మంగళవారం రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. శుక్రవారం నాడు నేపాల్ వెళ్లనున్నారు ప్రధాని.

క్యూ1 ఫలితాలు 
సోమవారం నాడు ఐసీఐసీఐ బ్యాంక్ క్యూ1 ఆర్థిక ఫలితాలు ప్రకటించనుంది. 
బుధవారం రోజున ఐషర్ మోటార్స్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. 
గురువారం నాడు జీ ఎంటర్టెయిన్‌మెంట్, ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీలు క్యూ1 రిజల్ట్స్‌ ప్రకటించనున్నాయి.
బైండింగ్ బిడ్స్ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు గురువారం నాడు ఫోర్టిస్ బోర్డ్ వర్గాలు భేటీ కానున్నాయి.

టెక్నికల్ లెవెల్స్
10650, 10620 పాయింట్లను బ్రేక్ చేయడంతో ఈ దిగువన నిఫ్టీలో వీక్‌నెస్ కొనసాగుతోంది. 10550 వరకు నిఫ్టీ దిగి వచ్చే అవకాశాల ఉండగా.. అప్‌సైడ్ 10680-10780 వరకూ నిఫ్టీ చేరుకునే ఛాన్స్ కనిపిస్తోంది. త్రైమాసిక ఫలితాలు, గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్‌తో పాటు టెక్నికల్ లెవెల్స్ మార్కెట్లకు దశాదిశ నిర్ణయించనున్నాయి.

అంతర్జాతీయ పరిణామాలు
యూఎస్‌లో ఇన్‌ఫ్లేషన్ పెరుగుతోందని ఫెడరల్ రిజర్వ్ అంటోంది. ఇది వడ్డీ రేట్ల పెంపుదలను వేగంగా చేపట్టవచ్చనే సంకేతాలను ఇస్తోంది. వచ్చే వారం ప్రైస్ డేటా విడుదల కానుంది.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మే 10వ తేదీన భేటీ కానుంది. వడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయి 0.5 శాతం వద్దే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అటున్నాయి.
డాలర్‌ హఠాత్తుగా ఊపందుకోవడంతో.. యూరో జోన్ స్టాక్స్‌ ధరలకు రేట్లు వస్తున్నాయి. యూరో నాలుగు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో.. వాల్‌స్ట్రీట్‌ను యూరోపియన్ స్టాక్స్ ఔట్‌పెర్ఫామ్ చేస్తున్నాయి.Most Popular