ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌ ఐపీఓ వివరాలు ఇవీ..

ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌ ఐపీఓ వివరాలు ఇవీ..

ముంబాయికి చెందిన ఆర్థిక సేవల సంస్థ ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ వచ్చే బుధవారం (మే 9న) ప్రారంభం కానుంది. ఈ నెల 11న ముగిసే ఇష్యూ ద్వారా కంపెనీ రూ.2వేల కోట్లను సమీకరించనుంది. ఇష్యూ ప్రైస్‌ బాండ్‌ ఒక్కో షేరుకు రూ.570-572గా కంపెనీ నిర్ణయించింది. ఆఫర్‌లో భాగంగా రూ.700 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు, ప్రస్తుత వాటాదారులకు చెందిన 30 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో విక్రయించనున్నారు. ఇందులో రిటైల్‌ పోర్షన్‌ వాటా 35 శాతం.  మే 8న యాంకర్‌ ఇన్వెస్టర్ల వద్ద నిధులను సమీకరించనున్నారు. సమీకరించిన నిధులను మూలధన అవసరాలకు వినియోగించనున్నారు. 

కార్పొరేట్‌, ఎస్‌ఎంఈ సంస్థలకు రుణాలను అందించే ఇండో స్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌ ఇటీవలే తమ సేవలను వాహన, గృహ రంగంలోకి కూడా విస్తరించింది. ముంబాయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, జైపూర్‌, సూరత్‌, అహ్మదాబాద్‌, పూణే, ఇండోర్‌ నగరాల్లో ఈ సంస్థ సేవలందిస్తోంది. పటిష్ట మైన డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నామని, గత కొన్నేళ్ళుగా ఏటా సగటున 25-30 శాతం వృద్ధిని సాధిస్తున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్‌, సీఈఓ ఆర్‌.శ్రీధర్‌ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే స్థాయి వృద్ధి సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇక ఫైనాన్షియల్‌ విషయానికి వస్తే 2014 నుంచి చక్కని లాభాలను ఆర్జిస్తోంది ఈ సంస్థ. గత ఐదేళ్ళ ఆర్థిక వివరాలను దిగువ పట్టికలో చూద్దాం.

ఈ ఏడాది జనవరిలో ఐపీఓకు వచ్చేందుకు సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసిన ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌కు గత నెల 13న అనుమతులు లభించాయి. ఈ ఐపీఓకు జేఎం ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, మోర్గాన్‌ స్టాన్లే ఇండియా కంపెనీ, మోతిలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్ అడ్వైజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, నోమురా ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌  సెక్యూరిటీస్‌ ఇండియాలు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌లో ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌ ఎవర్‌స్టోన్‌ క్యాపిటల్‌కు 42.3 శాతం వాటా ఉంది. ఏసీపీ లిబ్రాకు 16.35 శాతం, బేకన్‌ ఇండియా పీఈ సంస్థకు 10.8 శాతం చొప్పున వాటాలున్నాయి. 

IPO వివరాలు..
ఇష్యూ ప్రారంభం : 09-05-2018
ఇష్యూ ముగింపు : 11-05-2018
ఇష్యూ పరిమాణం : రూ.2వేల కోట్లు
ముఖవిలువ : ఒక్కో షేరు రూ.10
ఇష్యూ ధరల శ్రేణి : రూ.570-572
లిస్టింగ్‌ : బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ
రిటైల్‌ పోర్షన్‌ వాటా : 35 శాతం
జారీ చేసే షేర్లు : 3,07,69,231 షేర్లు
మినిమం లాట్‌ : 26 షేర్లు (రూ.14,872)
షేర్ల కేటాయింపు : 16-05-2018
రిఫండ్స్‌ : 17-05-2018
డీమ్యాట్‌ ఖాతాలోకి షేర్లు : 18-05-2018
లిస్టింగ్‌ : 21-05-2018Most Popular