పర్సనల్ లోన్స్‌పై ఈ 7 భ్రమలు పోగొట్టుకోండి

పర్సనల్ లోన్స్‌పై ఈ 7 భ్రమలు పోగొట్టుకోండి

త్వరగా అప్రూవల్స్, ఎలాంటి తాకట్టు అవసరం లేకపోవడం, నిధుల వినియోగంపై ఆంక్షలు-నియంత్రణలు లేకపోవడం, ముందస్తుగా ఆమోదం పొందిన ఆఫర్స్ వంటి అంశాలు పర్సనల్ లోన్స్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఎక్కువగా వ్యక్తిగత రుణాలపై దృష్టి నిలపడానికి కారణం కూడా ఇదే. అయితే పర్సనల్ లోన్స్ విషయంలో అనేక దురభిప్రాయాలు జనాల్లో ఉన్నాయి. చాలా ఖరీదుగా ఉంటాయని.. అప్రూవల్ కోసం ఎక్కువ సమయం పడుతుందని.. దీంతో తమ అత్యవసరాలు తీరకపోవచ్చని అనుకుంటూ ఉంటారు. 

పర్సనల్ లోన్స్ విషయంలో జనాల్లో ఉన్న కొన్ని అభిప్రాయాల గురించి తెలుసుకుందాం

సుదీర్ఘమైన ప్రాసెసింగ్ సమయం: 
పర్సనల్ లోన్ ప్రాసెసింగ్ కోసం చాలా ఎక్కువ సమయం అవసరం అవుతుందని.. అనేక రకాల ప్రక్రియలను దాటి రుణం అందే సరికి చాలా టైం పడుతుందని అనేకకమంది రుణగ్రహీతలు భావిస్తూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. ప్రస్తుతం పర్సనల్ లోన్స్‌ చాలా వేగంగా ప్రాసెసింగ్ జరుగుతోంది. అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో పాటు, పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో కూడా రుణాలను అందించే సదుపాయం అందుబాటులోకి వచ్చేసింది. ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్, ఇన్‌స్టంట్ అప్రూవల్స్ వంటి వాటితో.. కేవలం ఒక రోజునే రుణాలను ఇచ్చేందుకు కూడా రుణదాతలు ముందుకు వస్తున్నారు. ఇవి అన్‌సెక్యూర్డ్ రుణాలు కావడంతో.. డాక్యుమెంటేషన్ చాలా తక్కువగా ఉంటుంది.

తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే తిరస్కరిస్తారు: 
రుణ దరఖాస్తును పరిశీలించే సమయంలో రుణదాతలు ప్రధానంగా క్రెడిట్ స్కోర్‌నే పరిశీలిస్తారు. అయితే, ఇది రుణ మంజూరు విషయంలో ఎలాంటి ప్రభావం చూపదు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందనే ఒకే కారణంగా లోన్ అప్లికేషన్‌ను తిరస్కరించరు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండడంతో పాటు.. మీ చెల్లింపు సామర్ధ్యం, ఆదాయం స్థాయి వంటివి పరిగణలోకి తీసుకుంటారు. అయితే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నపుడు, వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

బ్యాంకులు మాత్రమే అప్పులిస్తాయి: 
పర్సనల్ లోన్స్‌ను కేవలం బ్యాంకులు మాత్రమే ఇస్తాయి అన్నది అవాస్తవం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు, డిజిటల్ లెండర్స్, పీర్ టు పీర్ లెండర్స్.. ఆకర్షణీయమైన విధానాలలో పర్సనల్ లోన్స్ ఇస్తున్నారు. బ్యాంకులు తమ పర్సనల్ లోన్ అప్లికేషన్‌ను తిరస్కరిస్తే.. మరో దారి లేదని రుణ గ్రహీతలు భావిస్త ఉంటారు. అయితే చాలా సందర్భాలలో బ్యాంకులు తిరస్కరించినా.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు మాత్రం ఆమోదిస్తుంటాయి. వారి అర్హతా నియమావళిలో ఉన్న మార్పులే ఇందుకు కారణం.

పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు ఎక్కువ: 
పర్సనల్ లోన్స్ విషయంలో చాలా ఎక్కువ వడ్డీ రేట్లు విధిస్తారని చాలామంది అనుకుంటారు. అయితే 10.99 శాతం వార్షిక వడ్డీ రేటుకు కూడా వ్యక్తిగత రుణాలు లభిస్తాయి. చెల్లింపు సామర్ధ్యంతో పాటు క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే ఇలా తక్కువ వడ్డీకి రుణాలను పొందవచ్చు. రుణాలు తీసుకునే వ్యక్తుల క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లను కంపెనీలు నిర్ణయిస్తుంటాయి. క్రెడిట్ కార్డ్ వంటి వాటిపై విధించే 18-48 శాతం వడ్డీతో పోల్చితే ఇవి చాలా తక్కువ. పలు ఎన్‌బీఎఫ్‌లు బంగారం కుదువ పెట్టుకున్నా 18 శాతం వడ్డీ వసూలు చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఇప్పటికే లోనే ఉంటే మరొకటి తీసుకునే ఛాన్స్ లేదు: 
ఇప్పటికే రుణగ్రహీత ఒక రుణం తీసుకుని ఉంటే.. మరొక రుణం తీసుకునేందుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ దరఖాస్తును ఆమోదించే సయమంలో.. మీ నికర ఆదాయం ఆధారంగా చెల్లింపు సామర్ధ్యాన్ని రుణదాతలు లెక్కిస్తారు. మీరు చెల్లించాల్సిన ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బకాయిలను పరిగణలోకి తీసుకుంటారు. అందుకే మీకు ఇప్పటికే రుణం ఉన్నా.. మరొక పర్సనల్ లోన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు చెల్లించగలరనే నమ్మకాన్ని అప్పు ఇచ్చే కంపెనీకి కల్పించగలిగితే, మీ దరఖాస్తుకు ఆమోదం లభిస్తుంది. 

ముందస్తు చెల్లింపు కుదరదు:
ఇతర రుణాల మాదిరిగా సుదీర్ఘ కాలం ఉండవు కాబట్టి.. పర్సనల్ లోన్స్‌కు ప్రీ పేమెంట్ ఆప్షన్ ఉండదని అందరూ అనుకుంటారు. కానీ ఇది కూడా అవాస్తవమే. ఇతర రుణాల మాదిరిగానే, వీటికి కూడా ముందస్తు చెల్లింపు అవకాశం ఉంటుంది కానీ.. నియమ నిబంధనలకు అనుగుణంగా కొంత ప్రీ పేమెంట్ ఫీజు చెల్లించమని రుణదాత అడగవచ్చు. ఏడాది నుంచి ఏడేళ్ల కాల వ్యవధి వరకు పర్సనల్ లోన్స్ ఉండే అవకాశం ఉంది. ముందస్తుగా అసలు మొత్తాన్ని కొంత మొత్తంలో చెల్లించడం ద్వారా.. రుణ భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. 

ఆన్‌లైన్ దరఖాస్తు చేయడం క్లిష్టమైన ప్రక్రియ:
వ్యక్తిగత రుణం అవసరమైన వారిలో చాలామంది ఇప్పటికీ ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందిన శాఖలను సంప్రదిస్తూ ఉంటారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం అంటే అదో కష్టతరమైన ప్రక్రియగా భావించి, దూరంగా ఉంటారు. కానీ వాస్తవంలో ఇది విరుద్ధంగా ఉంటుంది. అంటే ఆన్‌లైన్ అప్లికేషన్‌ చాలా సులభమైన విషయం. తనకు నచ్చిన విధంగా రుణాన్ని పొందేందుకు పలు సంస్థల శాఖల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం కూడా పడుతుంది. కానీ ఆన్‌లైన్ ఫైనాన్షియల్ మార్కెట్‌ప్లేస్‌లకు చెందిన ప్లాట్‌ఫామ్స్‌లో సులభంగా తక్షణమే రుణం పొందే సదుపాయం ఉంది. పేపర్ లెస్ ప్ర్రక్రియ ద్వారా సమయం కూడా ఆదా చేసుకోవచ్చు. రుణాలు ఇచ్చే ఇతర సంస్థలతో వడ్డీ వంటి అంశాలను పోల్చి చూసుకోవచ్చు. నచ్చిన చోటే పర్సనల్‌ లోన్‌ను ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు.Most Popular