పొరింజు చెబుతున్న 12 మల్టీబ్యాగర్స్ మీ దగ్గరున్నాయా?

పొరింజు చెబుతున్న 12 మల్టీబ్యాగర్స్ మీ దగ్గరున్నాయా?

స్మాల్‌క్యాప్స్ విషయంలో పొరింజు వెలియాత్‌‌పై మార్కెట్ వర్గాల్లో విపరీతమైన నమ్మకం ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త చిన్న స్టాక్స్‌ను ఈయన గుర్తిస్తూ ఉంటారు. అందుకే ఈయన పోర్ట్‌ఫోలియోపై, రికమెండేషన్స్‌పై మార్కెట్ జనాలు ఓ కన్నేసి ఉంచుతారు.

స్మాల్, మిడ్‌క్యాప్‌లలో సెల్ఆఫ్
300లకు పైగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌లలో భఆరీగా సెల్ఆఫ్ రావచ్చని పొరింజు వెలియాత్ అంచనా వేస్తున్నారు. తాజాగా సెబీ జారీ చేసిన మార్గనిర్దేశాలు, నిబంధనలకు అనుగుణంగా.. మ్యూచువల్ ఫండ్స్‌ కంపెనీలు తమ వాటాలను కొంతమేర ఉపసంహరించుకునే అవకాశం ఉండమే ఇందుకు కారణం.

రాబోయే కాలంలో కాబోయే మల్టీ బ్యాగర్స్‌ను ముందే గుర్తిస్తారని పొరింజుపై మదుపర్లకు విపరీతమైన నమ్మకం. లాంగ్ టెర్మ్ కోసం ఈయన రికమెండేషన్స్ అద్భుతాలు సృష్టిస్తాయని నమ్ముతారు. ప్రస్తుతం సెల్ ఆఫ్ వచ్చిన తర్వాత కొన్ని స్టాక్స్‌ను తగ్గినపుడు పట్టుకుంటే.. మంచి లాభాలు గడించవచ్చని ఆయన అంటున్నారు.

దేశీయ మార్కెట్లకు గత నెల ఎంతో నష్టం కలిగించిందని ఈక్విటీ ఇంటెలిజెన్స్ ఎండీ పొరింజు చెబుతున్నారు. ఇలాంటి మార్కెట్లలో సరైన ధరలలో స్టాక్స్‌ను పట్టుకోవడం కష్టం అంటారు పొరింజు వెలియాత్.

పొరింజు పోర్ట్‌ఫోలియో

మార్చ్ త్రైమాసికం చివరకు, పొరింజు పోర్ట్‌ఫోలియోలో ఆయా కంపెనీలలో 1 శాతం పైగా వాటాలు ఉన్న స్టాక్స్ 12 ఉన్నాయి. ఐజెడ్‌ఎంఓ, జెఐటిఎఫ్ ఇన్‌ఫ్రాలాజిస్టిక్స్‌లో వాటాలు 1 శాతం కంటే దిగువకు వచ్చాయి.

గత ఏడాది కాలంలో రెట్టింపునకు పైగా లాభాలను అందించిన బీసీఎల్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వాటాలను వెలియాత్ తగ్గించుకున్నారు. ఇది ఒక స్మాల్‌క్యాప్ డైవర్సిఫైడ్ కంపెనీ. వంట నూనెలు, డిస్టిలరీస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఈ కంపెనీ విధులు నిర్వహిస్తోంది. డిసెంబర్ చివరకు ఈ కంపెనీలో 1.41 శాతం వాటా పొరింజుకు ఉండగా.. ఇప్పుడు 1.27 శాతానికి తగ్గించుకున్నారు. 

ఒక శాతంపైగా వాటాలు ఉన్న కంపెనీలలో షేర్లను చాలావరకు యథాతథంగానే ఉంచారు పొరింజు. మొత్తం 12 కంపెనీలలో పదకొంటిలో వాటా శాతం మార్పు లేదు. ఈ జాబితాలో ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఏబీసీ ఇండియా, అన్సాల్ బిల్డ్‌వెల్, రౌనక్ ఈపీసీ ఇంటర్నేషనల్, సిమ్‌కో, పలాష్ సెక్యూరిటీస్, విస్తా ఫార్మా, కేరళ ఆయుర్వేద, పర్నాక్స్ ల్యాబ్, ఈస్టర్న్ ట్రేడ్స్, శార్దా ప్లైవుడ్ ఇండస్ట్రీస్ ఇందులో ఉన్నాయి. 

రాబడులు
ఈ 12 స్టాక్స్‌లో 5 కంపెనీలు గత ఏడాది కాలంలో లాభాలను అందించాయి. బీసీఎల్ ఇండస్ట్రీస్(96 శాతం), ఎమ్కే గ్లోబల్(82 శాతం), ఏబీసీ ఇండియా( 22 శాతం), అన్సాల్ బిల్డ్‌వెల్(9.3 శాతం), రౌనక్ ఈపీసీ(5 శాతం) లాభాలను అందించగలిగాయి.

నష్టపోయిన వాటిలో శార్దా ప్లైవుడ్(27 శాతం), ఈస్టర్న్ ట్రేడ్స్(25 శాతం), పర్నాక్స్ ల్యాబ్(15 శాతం) ఉన్నాయి.
 Most Popular