క్యూ4- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ జూమ్‌

క్యూ4- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ జూమ్‌

ప్రయివేట్‌ రంగ బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ గతేడాది(2017-18) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 404 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 407 వరకూ ఎగసింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర ప్రీమియం ఆదాయం రూ. 7526 కోట్ల నుంచి రూ. 8656 కోట్లకు ఎగసింది. కాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం మాత్రం దాదాపు 17 శాతం తక్కువగా రూ. 340 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 3.30 తుది డివిడెంట్‌ను ప్రకటించింది. Most Popular