నెల రోజుల కోసం ఈ పొజిషనల్ కాల్స్ తీసుకోవచ్చు!?

నెల రోజుల కోసం ఈ పొజిషనల్ కాల్స్ తీసుకోవచ్చు!?

అవంతి ఫీడ్స్: BUY| టార్గెట్ రూ. 2,900
రూ. 2400 రెసిస్టెన్స్ లెవెల్ వద్ద ఫాలింగ్ ఛానల్ నుంచి బ్రేకవుట్ తీసుకునే దిశగా ఈ స్టాక్ పయనిస్తోంది. ఈ లెవెల్‌కు ఎగువన మంచి వాల్యూమ్స్‌తో ట్రేడ్ అయితే రూ. 2700-2900 వరకు అప్‌ట్రెండ్ కొనసాగించే అవకాశం ఉంది. ఆర్‌ఎస్ఐ కూడా గత సపోర్ట్ జోన్ 43 వద్ద అప్‌సైడ్ టర్న్ అవడంతో.. రాబోయే సెషన్స్‌లో 50 లెవెల్‌కు ఎగువన ఈ స్టాక్‌ను తీసుకోవచ్చు.

 

ఐటీసీ: BUY| టార్గెట్ రూ. 320
భారీ వాల్యూమ్స్‌తో బుల్ క్యాండిల్‌ను చూపించడంతో.. ఈస్టాక్‌లో బుల్ ర్యాలీకి ఆస్కారం ఉంది. 9 వారాల గరిష్ట స్థాయి రూ. 275, ఛానల్ మిడ్‌పాయింట్ స్థాయికి చేరుకుంది. నెలవారీగా ఆర్ఎస్ఐ న్యూట్రల్ స్థాి 50కి చేరుకోవడంతో.. హైయర్ లెవెల్స్‌లో పొజిషన్ తీసుకోవచ్చు. రూ. 275కు ఎగువన స్థిరంగా ట్రేడ్ అయితే రూ. 290-320 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు.

 

ఆర్ఈసీ: BUY| టార్గెట్ 140
అసెండింగ్ ట్రయాంగిల్ కన్సాలిడేషన్‌ నుంచి బ్రేకవుట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఈ స్టాక్.. బేర్ ట్రెండ్ నుంచి రివర్సల్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. రూ. 132కు ఎగువన నిలకడగా మంచి వాల్యూమ్స్‌తో ట్రేడ్ అయితే.. బ్రేకవుట్ తీసుకుని రూ. 136-140 వరకూ ఈ స్టాక్ పెరిగే అవకాశాలున్నాయి.
 

గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడిన రికమెండేషన్స్‌ను నిపుణుల నివేదికల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ స్టాక్స్‌లో పెట్టుబడులపై లాభనష్టాలకు ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్ డాట్ ఇన్ బాధ్యత వహించదు. పెట్టుబడులు చేసే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ నిపుణులను సంప్రదించండి.Most Popular