ఎగుమతి ఆర్డర్‌తో పార్నాక్స్‌ లేబ్‌కు కిక్‌

ఎగుమతి ఆర్డర్‌తో పార్నాక్స్‌ లేబ్‌కు కిక్‌

అనుబంధ సంస్థ నాక్స్‌పార్‌ ఫార్మా ద్వారా ఎగుమతి ఆర్డర్‌ను పొందినట్లు వెల్లడించడంతో పార్నాక్స్‌ లేబ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు 16 శాతం దూసుకెళ్లి రూ. 60.50 వద్ద ట్రేడవుతోంది. 
రూ. 38 కోట్లు
అనుబంధ సంస్థ నాక్స్‌పార్‌ ద్వారా 4.44 మిలియన్‌ యూరోల(సుమారు రూ. 38 కోట్లు) విలువైన ఎగుమతి ఆర్డర్‌ను పొందినట్లు పార్నాక్స్‌ లేబ్‌ తాజాగా వెల్లడించింది. మల్టీ నేషనల్‌ కంపెనీలకు కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఫినిష్డ్‌ ఫార్ములేషన్లను తయారు చేస్తుంటుంది. కంపెనీలో ప్రమోటర్లకు 62.59 శాతం వాటా ఉంది. Most Popular