సెన్సెక్స్‌ 170 పాయింట్లు ప్లస్‌- మెటల్‌ వీక్‌!

సెన్సెక్స్‌ 170 పాయింట్లు ప్లస్‌- మెటల్‌ వీక్‌!

మిడ్ సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు మళ్లీ జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 173 పాయింట్లు ఎగసి 34,624కు చేరగా.. నిఫ్టీ 31 పాయింట్లు బలపడి 10,615 వద్ద ట్రేడవుతోంది. అయితే ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 3 శాతం పతనంకాగా.. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1 శాతం చొప్పున తిరోగమించాయి. మరోవైపు ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఫార్మా 0.6 శాతం పుంజుకున్నాయి. 
డెరివేటివ్స్‌ తీరిదీ
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో జీఎంఆర్‌, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌, యస్‌బ్యాంక్‌, బయోకాన్‌, బజాజ్‌ ఫిన్‌, ఆర్‌ఐఎల్‌, వొకార్డ్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఆయిల్‌ ఇండియా, కమిన్స్‌ 6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క రిలయన్స్‌ నావల్‌ 15 శాతం కుప్పకూలింది. ఈ బాటలో నాల్కో, హిందాల్కో, ఆర్‌కామ్‌, ఆర్‌పవర్‌, నిట్‌ టెక్‌, వేదాంతా, ఆంధ్రా బ్యాంక్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌ 9-3 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular