జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌కు నిధుల పుష్‌

జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌కు నిధుల పుష్‌

కమర్షియల్‌ పేపర్‌ జారీ ద్వారా నిధులను సమీకరించినట్లు వెల్లడించడంతో జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 835 వద్దట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 849ను అధిగమించింది. సుమారు నెల రోజుల కాలానికి జారీ చేసిన రెండు రకాల సెక్యూరిటీల ద్వారా మొత్తం రూ. 75 కోట్లను సమకూర్చుకున్నట్లు జూబిలెంట్‌ లైఫ్‌ తెలియజేసింది. ఫార్మా, లైఫ్‌ సైన్స్‌ విభాగాలలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించిన సంగతి తెలిసిందే. కంపెనీలో ప్రమోటర్లకు 50.68 శాతం వాటా ఉంది.Most Popular