క్యూ4 ఎఫెక్ట్‌- డెల్టా కార్ప్‌ అప్‌

క్యూ4 ఎఫెక్ట్‌- డెల్టా కార్ప్‌ అప్‌

గతేడాది(2017-18) చివరి త్రైమాసికంలో ప్రొత్సాహకర ఫలితాలు సాధించడంతో కాసినో నిర్వహణ సంస్థ డెల్టా కార్ప్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు దృష్టి సారించడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.3 శాతం పెరిగి రూ. 294 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 301 వరకూ ఎగసింది.
రూ. 45 కోట్లు
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి-మార్చి)లో డెల్టా కార్ప్‌ లిమిటెడ్‌ నికర లాభం నాలుగు రెట్లు జంప్‌చేసి రూ. 45 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 59 శాతం ఎగసి రూ. 172 కోట్లకు చేరింది. Most Popular