రెండో రోజూ లుపిన్‌ ర్యాలీ!

రెండో రోజూ లుపిన్‌ ర్యాలీ!

టెట్రాబెనజైన్‌ ట్యాబ్లెట్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించడంతో దేశీ ఫార్మా దిగ్గజం లుపిన్‌ కౌంటర్‌ వరుసగా రెండో రోజు వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 2.3 శాతం పెరిగి రూ. 830 వద్ద ట్రేడవుతోంది. సోమవారం సైతం ఈ కౌంటర్‌ 2 శాతం స్థాయిలో పుంజుకున్న సంగతి తెలిసిందే. కాగా.. నేటి ట్రేడింగ్‌లో తొలుత రూ. 833 వరకూ ఎగసింది.
రెండు డోసేజీలలో
టెట్రాబెనజైన్‌ ట్యాబ్లెట్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు లుపిన్‌ పేర్కొంది. వీటిని 12.5 ఎంజీ, 25 ఎంజీ డోసేజీలలో విక్రయించనున్నట్లు తెలియజేసింది. వేలియంట్‌ ఫార్మా విక్రయించే జెనాజైన్‌ ఔషధానికి జనరిక్‌ వెర్షన్‌ అయిన టెట్రాబెనజైన్‌ ట్యాబ్లెట్లకు వార్షికంగా దాదాపు 29 కోట్ల డాలర్ల మార్కెట్ ఉన్నట్లు అంచనా. Most Popular