డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌కు డిజిన్వెస్ట్ జోష్‌!

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌కు డిజిన్వెస్ట్ జోష్‌!

పీఎస్‌యూ రంగ సంస్థ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ విక్రయానికి ప్రభుత్వం నెల రోజుల్లోగా బిడ్స్‌ను ఆహ్వానించనున్నట్లు వార్తలు వెలుడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌వైపు దృష్టిసారించారు. కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 660 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 672 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రభుత్వానికి 73.47 శాతం వాటా ఉంది. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా మొత్తం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డ్రెడ్జింగ్‌ డిజిన్వెస్ట్‌మెంట్‌కు కేంద్ర కేబినెట్‌  గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 
రూ. 2,000 కోట్ల కాంట్రాక్టులు
2016-17లో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ రూ. 600 కోట్ల టర్నోవర్‌ సాధించింది. 2017 సెప్టెంబర్‌కల్లా కంపెనీ నెట్‌వర్త్‌ రూ. 1547 కోట్లకుపైగా నమోదైంది. ఐదేళ్ల కాలంలో పూర్తిచేయాల్సిన రూ. 2,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను పొందిన కంపెనీ కేంద్ర షిప్పింగ్‌ శాఖ నిర్వహణలో ఉంది.Most Popular