మెటల్‌, ఐటీ వీక్- అయినా మార్కెట్ల జోరు!

మెటల్‌, ఐటీ వీక్- అయినా మార్కెట్ల జోరు!

మెటల్‌, ఐటీ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నప్పటికీ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 152 పాయింట్లు పెరిగి 34,602ను తాకగా.. నిఫ్టీ 21 పాయింట్లు బలపడి 10,606 వద్ద ట్రేడవుతోంది. ఎల్‌ఎంఈలో అల్యూమినియం ధరల పతనంతో ఇన్వెస్టర్లు మెటల్‌ కౌంటర్లలో భారీ అమ్మకాలకు తెరతీశారు. మరోపక్క ముందురోజు హైజంప్‌ చేయడంతో లాభాల స్వీకరణకుగాను ఐటీ కౌంటర్లలోనూ అమ్మకాలు చేపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎన్‌ఎస్ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 2.4 శాతం పతనంకాగా.. ఐటీ  1.2 శాతం నీరసించింది. ఫార్మా, రియల్టీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాలు 1-0.3 శాతం మధ్య పుంజుకున్నాయి. 
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లు ఇలా
డెరివేటివ్‌ విభాగంలో వొకార్డ్‌, యస్‌బ్యాంక్‌, బయోకాన్‌, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఆర్‌ఐఎల్‌, లుపిన్‌, సీఈఎస్‌సీ, గ్రాన్యూల్స్‌, రేమండ్‌ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క నాల్కో, హిందాల్కో 8 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో రిలయన్స్‌ నావల్‌, వేదాంతా, నిట్‌ టెక్‌,  బాలకృష్ణ, విప్రో, ఆంధ్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్‌ 5-2 శాతం మధ్య క్షీణించాయి. Most Popular